Home /News /politics /

KARNATAKA ASSEMBLY SESSION HAS BEEN ADJOURNED TILL JULY 22 THE TRUST VOTE WILL BE HELD ON MONDAY JULY 22ND BA

Karnataka Floor Test | కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా.. బలపరీక్ష 22కి వాయిదా

కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్

కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్

Karnataka Assembly | కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగింది. రెండో రోజు కూడా బలపరీక్ష జరగలేదు. ఈనెల 22వ తేదీకి సభ వాయిదా పడింది.

    కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగింది. రెండో రోజు కూడా బలపరీక్ష జరగలేదు. ఈనెల 22వ తేదీకి సభ వాయిదా పడింది. అదేరోజు బలపరీక్ష జరిగే అవకాశం ఉంది.కర్ణాటకలో ఇవాళే బలపరీక్ష జరపాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా.. సీఎం కుమారస్వామికి డెడ్ లైన్ విధించారు. ఈరోజు మధ్యాహ్నం 1.30లోపు నిర్వహించాలంటూ నిన్న కండిషన్ పెట్టారు. అయితే, ఆ డెడ్‌లైన్ లోపు కూడా బలపరీక్ష జరగలేదు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు మరో డెడ్ లైన్ విధించారు. అయితే, గవర్నర్ లేఖపై కుమారస్వామి సెటైర్లు వేశారు. గవర్నర్ పంపిన రెండో లవ్ లెటర్ తనను ఎంతో బాధించిందన్నారు. మరోవైపు గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశాలను సీఎం కుమారస్వామి పాటించాలని, అర్ధరాత్రిఅయినా సరే ఇవాళే బలపరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప శాసనసభలో డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా గవర్నర్ సూచనలను పాటించాల్సి ఉందన్నారు. అయితే, గవర్నర్ నుంచి లేఖ వచ్చింది సీఎం కుమారస్వామికి కాబట్టి, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనేనంటూ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ దశలో కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అయితే, తమ సభ్యులు సైలెంట్‌గా ఉంటారని, సభను నిర్వహించి ఓటింగ్ జరపాలంటూ యడ్యూరప్ప స్పీకర్‌ను కోరారు. చివరకు ‘ఎవరేం అనుకున్నా నేను ఇంకా ఎక్కువసేపు కూర్చోలేను.’ అంటూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

    అంతకుముందు కర్ణాటక సంక్షోభంపై సీఎం కుమారస్వామి, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు గుండురావ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 17న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల విషయంలో తమకు క్లారిటీ కావాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేలు సభకు కచ్చితంగా హాజరుకావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాల వల్ల తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ ఇచ్చే హక్కును కోల్పోతుందని, తాము చట్టపరమైన హక్కును ఎలా వదులుకుంటామని గుండురావ్ తమపిటిషన్‌లో ప్రశ్నించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hd kumaraswamy, Karnataka political crisis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు