ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈనెల 14న (మంగళవారం) వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ జరిగిన తీరును బట్టి తానే విజయం సాధించినట్లు కరీంనగర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ముందస్తు సంబురాలు చేసుకున్నారు. అసలు ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉన్నా, పోలింగ్ ముగిసిన వెంటనే సర్దార్ వర్గీయులు పటాకులు పేల్చుతూ ఊరేగింపులు చేయడం చర్చనీయాంశమైంది..
(P.Srinivas,News18,Karimnagar)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 12 స్థానాలుండగా, ఆరిటింటి అధికార టీఆర్ఎస్ ఏకగ్రీవం చేసుకోగా, ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు శుక్రవారం నాడు పోలింగ్ పూర్తయింది. తొలి నుంచీ వార్తల్లో నిలిచిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈనెల 14న (మంగళవారం) వెలువడనున్నాయి. అయితే, పోలింగ్ జరిగిన తీరును బట్టి తానే విజయం సాధించినట్లు కరీంనగర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ముందస్తు సంబురాలు చేసుకున్నారు. అసలు ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉన్నా, పోలింగ్ ముగిసిన వెంటనే సర్దార్ వర్గీయులు పటాకులు పేల్చుతూ ఊరేగింపులు చేయడం చర్చనీయాంశమైంది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం నాడు ప్రశాంతంగా ముగిశాయి .100 శాతం ఓట్లువేసి మహిళలు స్ఫూర్తిగా నిలిచారు . నలుగురు నాయకులు పలు కారణాలతో ఓటింగ్ పాల్గొనకపో వడంతో పురుషులు 99.5 శాతానికి పరిమితమయ్యారు . నిన్న ఉదయం 8 గంటలకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ , హుజురాబాద్ , సిరిసిల్ల , జగిత్యాల , కోరుట్ల , పెద్దపల్లి , మంథని , హుస్నాబాద్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది . ఉదయం దాదాపు అన్ని కేంద్రాల్లో మందకొడిగా సాగిన ఓటింగ్ ప్రక్రియ 11 గంటల తరువాత ఊపందుకుంది . 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా .. 1,324 ఓట్లకు గాను సాయంత్రానికి 1,320 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు . మొత్తంగా 99.70 శాతం పోలింగ్ నమోదైంది .
ఇక ఓటింగ్ సరళిని చూసి రెండుస్థానాలు మావే అంటూ అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ఇతర పార్టీల ఓట్లు తమకే పడతాయని కూడా నిన్న మీడియాతో మంత్రి చెప్పడం కూడా జరిగింది. మంత్రితోపాటు అభ్యర్థులు ఎల్.రమణ , భానుప్ర సాదరావు కూడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ముందస్తుగానే సంబురాలు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది .ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత రవీందర్ సింగ్ అభిమానులు బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు . ఈ సంబురాల్లో ఆయన కూడా పాల్గొనడం విశేషం . రవీందర్ సింగ్ నాయత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అభిమానులు చేశారు .
పోలింగ్ ముగిసిన వెంటనే కొద్దిసేపటికే రవీందర్ సంబరాలు నిర్వహించడమే హాట్ టాపిక్ గా మారింది . స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ వేస్తారన్న దీమా కూడా సర్దార్ రవీందర్ సింగ్ శిబిరంలో వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ కు షాకిస్తూ సర్దార్ విజయం సాధించబోతున్నారంటూ ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన విక్టరీకి తగ్గట్టుగా ఓట్లు పడితీరుతాయన్న కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన ఓటర్లే మెజార్టీకి మించి ఉండడంతో పాటు క్యాంపుల్లో ఉన్న వారంతా రవీందర్ సింగ్ చట్ లోకి వచ్చే అవకాశాలు లేవన్నది వాస్తవం . ఇలాంటి పరిస్థితుల్లో ఆయన శిబిరం సంబురాలు చేసుకోవడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీసింది . అయితే పోలింగ్ జరిగిన తిరును బట్టి చూస్తుంటే రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ గెలుపునకు అవసరమైన ఓట్లు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫలితం ఎలా ఉండబోతోందో మరో మూడు రోజుల్లో తేలనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.