Home /News /politics /

KARIMNAGAR MLC CAMPAIGNING ENDS TODAY TRS AND BJP CONGRESS BACKED SARDAR RAVINDER SINGH CONFIDENT OVER VICTORY MKS KNR

karimnagar mlc : ఈటల పాచికతో ఫలితం తారుమారు? -ఓటర్లకు ఆ ట్రైనింగ్ ఇస్తోన్న trs

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక

టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు పోగా, బరిలో ఉన్న మిగతా 8 మంది ఇండిపెండెంట్లతో మాట్లాడి ఉమ్మడి అభ్యర్థిగా సర్దార్ ను ఎంచుకునే దిశగా ఈటల రాజేందర్ పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ కూడా సహకరిస్తున్నట్లుంది. అయితే, ఎవరెన్ని ఎత్తులు వేసినా జిల్లాలోని రెండు స్థానాల్లో తాము సునాయాసంగా గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు..

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)
  తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరింటిని టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోగా, మిగిలిన 6 స్థానాల్లో ఈనెల 10న పోలింగ్ జరుగనుంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రచార పర్వం 72 గంటల ముందే, అంటే, ఇవాళే(మంగళవారం) ముగియనుంది. ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లో.. కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను ఓడించిన బీజేపీ ఈటల రాజేందర్ కరీంనగర్ ఎమ్మెల్సీపైనా ఫోకస్ పెట్టడం, టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సింగ్ కు బాహాటంగా మద్దతు పలకడం, కాంగ్రెస్ సైతం తన ఓటర్లను క్యాంపులకు తరలించిన నేపథ్యంలో టీఆర్ఎస్ కొంత సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు పోగా, బరిలో ఉన్న మిగతా 8 మంది ఇండిపెండెంట్లతో మాట్లాడి ఉమ్మడి అభ్యర్థిగా సర్దార్ ను ఎంచుకునే దిశగా ఈటల రాజేందర్ పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరెన్ని ఎత్తులు వేసినా జిల్లాలోని రెండు స్థానాల్లో తాము సునాయాసంగా గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు..

  కరీంనగర్ ఎస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకుంది . మంగళవారం తో ప్రచారం ముగియనున్న వేళ అధికార,విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి .ఇందులో ప్రతిపక్షాలు తమకు పట్టు ఉన్న చోట వీలైనన్ని ఓట్లు అధికార పార్టీకి పడకుండా తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తు న్నాయి . ముఖ్యంగా మంథని , హుజూరాబాద్ , పెద్దపల్లి ప్రాంతాల్లో ఉన్న ఓట్లపై దృష్టి సారించారు . ఇక్కడ ఓట్లు అధికార పార్టీకి పడకుండా చూడాలన్న పట్టుదలతో ఉన్నారు . మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ , మంథని ఎమ్మెల్యే , మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు వ్యూహం రూపొందించారని తెలిసింది .

  etela rajenderపై ప్రతీకారం.. టీఆర్ఎస్‌ క్లర్కుగా కలెక్టర్ హరీశ్.. cm kcrపైనా జమున ఫైర్  మంథని ప్రాంతం లోని దాదాపు 40 మంది కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధు లను గోవా శిబిరానికి తరలించరు. మూడు ప్రాంతాల్లో .. హుజూరాబాద్ , పెద్దపల్లి ప్రాంతాల్లోనూ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా , స్వతంత్రులకు ఓటేసేలా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం . హుజురాబాద్లో 181 , మంథనిలో 98 ఓట్లు ఉన్నాయి . ఈ రెండు ప్రాంతాల్లో గరిష్టంగా ఓట్లు అధికార పార్టీకి పడకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు . అదే సమయంలో పెద్దపల్లిలో ఏకంగా 209 మంది ఉన్నరు . మూడు ప్రాంతాల్లో కలిపి మొత్తం 488 ఓట్లు ఉన్నాయి . పెద్దపల్లిలో ఓట్ల చీలిక చాలా కష్టమైన పని అయినా .. శ్రీధర్ బాబు, ఈటల ఎవరికి వారే  పాచికలు వేస్తున్నారు . అంతిమంగా రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ గెలుపు దిశగా రాజకీయం నడుపుతున్నారు.

  Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..  కాగా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ చేతిలో అధికారపక్ష సభ్యులతోపాటు విపక్షాలు , స్వతంత్రుల ఓట్లు కూడా తమకే పడతాయని అధికార పార్టీ నేతలు ఇప్పటికే ధీమాగా ఉన్నారు. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత , పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఈనెల 8 న టీఆర్ఎస్ లో చేరబోతున్నారు . ఆయనతోపాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా గులాబీ కండువా కప్పు కోనున్నారు. ఈ క్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తాము అవలీలగా గెలుస్తామని అధికార పార్టీ నేతలంతా ధీమాగా ఉన్నారు .

  స్కూల్ పిల్లలు కూడా సిగ్గుపడతారు.. మీరిక మారరా? : బీజేపీ ఎంపీలకు PM Modi సీరియర్ వార్నింగ్  ఓటింగ్ లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న తమ సభ్యులకు పోలింగ్ రోజు ఎలా ఓటు వేయాలి? అన్న శిక్షణ కూడా రెండు పర్యాయాలుగా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి నేరుగా ఓటింగ్ రోజు ఓటింగ్ హాల్ కు వచ్చి వేసే విధంగా అధికార పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. 10 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కర్ణన్ తెలిపారు. మంగళవారంతో ప్రచారం గడువు ముగుస్తుందని, ఆ తర్వాత కూడా ఎవరైనా ప్రచారం చేస్తే నిబంధనల ఉల్లంఘన కింద రెండు సంవత్సరాల జైలు శిక్ష , జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
  Published by:Madhu Kota
  First published:

  Tags: CM KCR, Etela rajender, Karimnagar, Mlc elections, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు