అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయండి.. పోలీసులకు కరీంనగర్ కోర్టు ఆదేశం..

హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆధారాలతో సహా బీజేపీ నేతలు కోర్టుకు సమర్పించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని జిల్లా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 31, 2019, 10:14 PM IST
అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయండి.. పోలీసులకు కరీంనగర్ కోర్టు ఆదేశం..
అక్బరుద్దీన్ ఒవైసీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎంఐఎం ముఖ్యనేత, చంద్రాయణగుట్టు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని కరీంనగర్ జిల్లా పోలీసులను అక్కడి జిల్లా కోర్టు ఆదేశించింది. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆధారాలతో సహా బీజేపీ నేతలు కోర్టుకు సమర్పించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని జిల్లా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. 24న కరీంనగర్‌లోని ఎన్ఎన్ గార్డెన్స్‌లో ఎంఐఎం కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి హజరైన అక్భరుద్దీన్ ప్రసంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ సందర్భంలో.. కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు. రాబోయే తరాల గురించే నా భయమంతా. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్‌ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే’అంటూ అక్బరుద్దీన్‌ ప్రసంగించారు.

కరీంనగర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్


కరీంనగర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్


కరీంనగర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్


దీనిపై, బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన ప్రసంగంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు లేవని పోలీసుల ప్రకటించారు.అయితే, లాయర్, బిజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి అక్బరుద్దీన్ ప్రసంగంపై కోర్టును ఆశ్రయించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు మతవిద్వేశాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, వీడియో ప్రసంగం సీడీతో సహా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను, ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 31, 2019, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading