Home /News /politics /

‘నా పేరు బండి సంజయ్… నేను కరీంనగర్ ఎంపీ’

‘నా పేరు బండి సంజయ్… నేను కరీంనగర్ ఎంపీ’

బండి సంజయ్(File)

బండి సంజయ్(File)

అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు.

    కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశానికి హాజరైన ఎంపీ బండి సంజయ్... అధికారులకు చురకలంటించారు. తనను చాలామంది అధికారులు గుర్తించడం లేదని సమావేశంలో ప్రస్తావించిన బండి సంజయ్... సమావేశం ప్రారంభంలోనే తన పేరు బండి సంజయ్ అని... తాను కరీంనగర్ ఎంపీని అని తన గురించి తాను చెప్పుకున్నారు. కేంద్ర పథకాలను జనాలను వివరించి చెప్పాలని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర సాయం కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలతో అధికారులకు సంబంధం లేదన్న బండి సంజయ్... నాయకులు పలుసార్లు విభేదించుకుంటారని... మళ్లీ కలుస్తారని అన్నారు. అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమానంగా చూడాలని అన్నారు. కేంద్రం అనేక పథకాలకు నిధులు ఇస్తోందని... కానీ అధికారులు ఆ వివరాలను ప్రజలకు చెప్పడం లేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి కేంద్రం ఇస్తున్న నిధులను అధికారులు ఎక్కడా చెప్పడం లేదని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా పాల్గొన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bandi sanjay, Bjp, Karimangar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు