news18-telugu
Updated: March 17, 2020, 2:48 PM IST
తెలుగుదేశం పార్టీ లోగో
టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇటీవల వైసీపీకి దగ్గరయ్యారు. తనయుడు కరణం వెంకటేశ్‌కు వైసీపీ కండువా కప్పించిన బలరాం... తాను మాత్రం టీడీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యే బాటలో నడవాలని డిసైడయ్యారు. దీంతో అసెంబ్లీలో ఇక ఆయన కూడా టీడీపీకి దూరమైనట్టే. అయితే కరణం బలరాం ఇప్పటికప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో వైసీపీని ఎదుర్కొనే విషయంలో ధీటుగానే కనిపించిన కరణం బలరాం... ఉన్నట్టుండి వైసీపీలోకి వెళ్లడం ఏమిటనే దానిపై టీడీపీ వర్గాల్లోనూ ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే కొందరు ఆయనది వ్యూహమని అంటుంటే... మరికొందరు మాత్రం ఆయన చేసింది త్యాగమని చర్చించుకుంటున్నారు. కుమారుడిని రాజకీయాల్లో నిలబెట్టాలని భావించిన కరణం బలరాం...ఇందుకోసం చాలానే ప్రయత్నాలు చేశారు. అయితే కుమారుడిని మాత్రం ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్ కారణంగా తన అద్దంకి సీటును కూడా కోల్పోయింది కరణం ఫ్యామిలీ.

కరణం బలరాం(ఫైల్ ఫోటో)
గత ఎన్నికల్లో గొట్టిపారి రవికుమార్‌కు మళ్లీ అద్దంక నుంచే పోటీ చేసే ఛాన్స్ ఉండటంతో... అద్దంకి సీటు కోసం కరణం బలరాం ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీలైతే తాను, లేకపోతే తన కుమారుడిని అద్దంకిలో వైసీపీ తరపున పోటీ చేస్తామని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తీసుకున్న నిర్ణయంతో త్యాగంతో పాటు వ్యూహం కూడా ఉన్నట్టు అర్థమవుతోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
March 17, 2020, 2:48 PM IST