KAPU LEADERS SECRET MEETING IN HYDERABAD GRABS POLITICAL ATTENTION IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK
Kapu Political Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ..? కాపు నేతల సీక్రెట్ మీటింగ్ వెనుక కారణం ఇదేనా..?
హైదరాబాద్ లో కాపు నేతల సమావేశం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతుందా..? ఇప్పటికే పలు పార్టీలుండగా మరో పార్టీ అవసరం ఉందా..? ప్రస్తుతం ఈ ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త పార్టీ రాబోతుందా..? ఇప్పటికే పలు పార్టీలుండగా మరో పార్టీ అవసరం ఉందా..? ప్రస్తుతం ఈ ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో కాపు నేతల సమావేశం... కొత్త పార్టీ పెట్టడానికి చర్చలు.. హాజరైన ముఖ్య కాపు నేతలు.. ఇది సోమవారం మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్. అసలు వాస్తవానికి ఏం జరిగింది? హైదరాబాద్ లో కాపు నేతల సమావేశం ఎప్పుడు జరిగింది. సమావేశం జరిగిన నాలుగు రోజులకు సడెన్ గా హాడవిడి ఎందుకు చేశారు అనేదే ఇప్పుడ రాజకీయవర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఒక పక్కా రాజకీయ వ్యూహాంతోనే సమాశం జరిగిన మూడు రోజులకు తమకు అనుకూలంగా ఉన్న ఛానల్ నుంచి ఈ వార్తను లీక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జగన్ పాలనకు వ్యతిరేకంగా కాపు నేతలందరు ఒక్కటవుతున్నారు. ఇదే అదునుగా అటు తెలుగు దేశం, బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే తెలుగుదేశంలోని ఒక ముఖ్యనేత డెరెక్షన్ లో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాపులందరు ఒక్కతాటిపైకి వస్తునార్న సంకేతాలు అధికార పార్టీకి ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
వాస్తవానిక గత గురువారం హైదరాబాద్ లో ఒక ప్రముఖ హోటల్ లో కాపు నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న కాపు నేతలందరూ పార్టీలకి అతీతంగా హాజరైయ్యారు. జేడీ లక్ష్మీనారాయణతోపాటు కొందరు మాజీ ఐఏఎస్ అధికారులు, ముద్రగడ పద్మనాభం అనుచరులు కూడా హాజయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాపు రిజ్వరేషన్ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం పై ఒత్తడి తీసుకొచ్చి దారికి తెచ్చుకోవడానికి అవలంబిచాల్సిన అంశాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్లి అనే అంశాలకు సంబంధించి కాపునేతలంతా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి హాజరైన నేతలు కావాలనే సమావేశం అయిపోయిన నాలుగు రోజుల తరువాత తమకు అనుకూలంగా ఉన్న మీడియా నుంచి ఈ లీక్ లు ప్రభుత్వానికి పంపించినట్లు తెలుస్తోంది. ఇదంత తమ వ్యూహాంలో భాగంగా ఈ లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే సమావేశానికి బిజేపీ,జనసేన, టీడీపీ నేతలు వెనుక ఉండి పావులు కదిపినట్లు తెలుస్తోంది. కాపులు ఒక్కటవుతున్నారు అనే సంకేతాలతో జగన్ ప్రభుత్వంలో కొత్త ఆందోళనకర వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే పక్క స్కైచ్ తో సమావేశం నిర్వహించడం అది రహస్య సమావేశంగా అందరు అనుకునేలా చేయడం అన్ని చకచక జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిజేపీ,జనసేన, టీడీపీ ఒక్కటైతే కాపులు ఈ మూడు పార్టీలకు మద్దతు ఇవ్వాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. కాపు ఓటు బ్యాంక్ ఎటూ వెళ్లకుండా ఈ కుటమికి వస్తోందని అప్పుడు కాపులకు రాజ్యధికారం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సమావేవంలో పాల్గోన్న నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తనికి ఈ కాపు సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయల్లో ఎలాంటి అలజడి సృష్టిస్తోందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.