సుజనా చౌదరి సమావేశానికి డుమ్మా కొట్టిన కన్నాఅండ్ కో

సుజనా కోసం పెట్టిన సమావేశనికి కన్నా వర్గం దూరంగా ఉండటం ఇప్పుడు ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: July 14, 2019, 12:42 PM IST
సుజనా చౌదరి సమావేశానికి డుమ్మా కొట్టిన కన్నాఅండ్ కో
బీజేపీ నేత సుజనా చౌదరి
news18-telugu
Updated: July 14, 2019, 12:42 PM IST
విజయవాడలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయన డుమ్మా కొట్టారు. సుజనా చౌదరి బీజేపీల ోచేరిన తర్వాత తొలిసారిగా ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా సుజనా కోసం సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి కన్నాతో పాటు... ఆయన అనుచరులు ఎవరూ కూడా హాజరుకాలేదు. కొందరు బీజేపీ ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు. సుజనా కోసం పెట్టిన సమావేశనికి కన్నా వర్గం దూరంగా ఉండటం ఇప్పుడు ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత రాష్ట్రానికి వచ్చిన సుజనాకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఈ సందర్భంగా మాట్లాడిన సుజనా చౌదరి... బిజెపిలో చేరే ముందువరకూ నేను పరోక్ష రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఏపీలో బిజెపి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుందని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రణాళికలతో స్ఫూర్తి పొంది...తాను  బిజెపిలో చేరానన్నారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మన దేశ గౌరవాన్ని రొమ్ము విరుచుకుని నిలుచునేలా చేశారన్నారు సుజనా. భారతీయ జనతాపార్టీ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపే ఉన్నాయన్నారు. భారతీయ జనతాపార్టీ ఏపీలో రాబోయే రోజులలో అత్యంత అవసరమయిన ప్రత్యామ్నాయంగా భావించు.. తాను బిజెపిలో చేరానని చెప్పుకొచ్చారు సుజనా.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...