ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టెరిన్ గ్యాస్ లీకేజీ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ రూ.కోటి చొప్పున పరిహారం అందించారు. చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారికి రూ.25000, ఆస్పత్రిలో రెండు మూడు రోజుల పాటు ఉండి చికిత్స పొందిన వారికి రూ. లక్ష, వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకున్న వారికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే, వారి వైద్యం ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే, గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయిన జంతువులకు రూ.25000, ఖర్చుల కింద మరో రూ.20000 ఇస్తామని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఉన్న 15000 మందికి ఒక్కొక్కరికి రూ.10000 ఆర్థిక సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ప్రకటించిన నిర్ణయాన్ని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. గ్యాస్ లీక్ ఘటన గురించి తెలిసిన తర్వాత ప్రభుత్వ అనుమతితో కన్నా లక్ష్మీనారాయణ రోడ్డు మార్గంలో విశాఖ బయలుదేరారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.