రూ.1000 పంపిణీపై వివాదం... కన్నా సంచలన డిమాండ్... ఎస్ఈసీకి లేఖ

ప్రభుత్వం అందించే సాయం విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జోక్యం చేసుకోకుండా చూడాలని ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

news18-telugu
Updated: April 5, 2020, 3:02 PM IST
రూ.1000 పంపిణీపై వివాదం... కన్నా సంచలన డిమాండ్... ఎస్ఈసీకి లేఖ
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.1000 పంపిణీ చేస్తోంది. అయితే, ఈ రూ.1000ని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పంపిణీ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం చేసే సాయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వాస్తవానికి గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా ఆ డబ్బులను పంపిణీ చేయాల్సి ఉన్నా, వైసీపీ నేతలు దాన్ని హైజాక్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారే పంపిణీ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తాము చేస్తున్న సాయాన్ని గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని బహిరంగంగానే అభ్యర్థిస్తున్నారని కన్నా తెలిపారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజలను మభ్యపెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని అన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు.

Sec n Ramesh kumar, security increased for Ramesh kumar, tdp, ysrcp, chandrababu naidu, ap news, ap politics, రమేశ్ కుమార్, రమేశ్‌ కుమార్‌కు భద్రత పెంపు, టీడీపీ, వైసీపీ, చంద్రబాబునాయుడు, ఏపీ న్యూస్, ఏపీ రాజకీయాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్


పేదలకు ఇస్తున్న రూ.1000లో కూడా అధికార పార్టీ నేతలు రూ.200, రూ.300 కట్ చేసుకుని ఇస్తున్నారని కొన్ని పేపర్లు, టీవీ చానళ్లలో వార్తలు వస్తున్నాయనే విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ఎస్ఈసీ రమేష్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం పూర్తిగా పేదలకు చేరకపోవడం మరింత బాధాకరమైన విషయమని అన్నారు. అదే సమయంలో పేదల వద్దకు వెళ్లే వారు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోవడం లేదని, పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని, దీని వల్ల వైరస్ మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

ఎస్ఈసీ రమేష్ కుమార్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ


ప్రభుత్వం అందించే సాయం విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జోక్యం చేసుకోకుండా చూడాలని ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టాన్ని ఉపయోగించి వారిని డిస్ క్వాలిఫై చేసి జైలుకు పంపాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 5, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading