Home /News /politics /

KANNA LAKSHMI NARAYANA TWEET OVER NARA LOKESH GANG IN TANA 2019 SB

తానా సభల్లో లోకేష్ గ్యాంగ్... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ పెంచారంటూ...మోదీ చేసిన అభివృద్ధిపై రాంమాధవ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంతలో కొందరు ప్రవాసాంధ్రులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

    తానా సభలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువాళ్ళ ప్రతిష్ఠ దిగజరుస్తున్నారన్నారు. బీజేపీ అగ్రనేత రాంమాధవ్‌ని ఆహ్వానించి ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించారని మండిపడ్డారు. అమెరికాలో లోకేష్ గ్యాంగ్ మరోసారి తన నిచబుద్దిని బయటపెట్టిందన్నారు. ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుందన్నారు కన్నా. దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

    అమెరికా వాషింగ్టన్‌లో తాజాగా తానా మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా గౌరవ అతిథిగా హాజరయ్యారు. అయితే, ఊహించని విధంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.తానా మహాసభల్లో రాంమాధవ్ ప్రసంగిస్తూ, ఇరు రాష్ట్రాల తెలుగువారంతా ఐకమత్యంగా ఉండి, అభివృద్ధి బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్టను ప్రధాని మోదీ పెంచారంటూ...మోదీ చేసిన అభివృద్ధిపై మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంతలో కొందరు ప్రవాసాంధ్రులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈలలు, కేకలు వేస్తూ వేస్తూ గందరగోళం సృష్టించారు. వేదిక నుంచి దిగిపోవాలని నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న రాంమాధవ్ తన ప్రసంగాన్ని తొందరగా ముగించేశారు.



    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: America, AP Politics, Bjp, Bjp-tdp, Kanna laxminarayana, Nara Lokesh, NRI, Ram Madhav, TANA

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు