పోలీసులపై తిరగబడతాం... ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల్లో గెలవడం కోసం పథకాల్లో కోత పెడతామంటూ ప్రజలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

news18-telugu
Updated: February 19, 2020, 4:00 PM IST
పోలీసులపై తిరగబడతాం... ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్,కన్నా లక్ష్మీనారాయణ(File Photos)
  • Share this:
అక్రమ కేసులు బనాయిస్తే పోరాటానికి వెనుకాడే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడితే ప్రతిఘటిస్తామని... పోలీసులపై తిరగబడేందుకు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అధికారాన్ని అడ్డంగా పెట్టుకోని సీఎం జగన్ అక్రమ పాలన సాగిస్తున్నారని కన్నా ఆరోపించారు. బాబు ఫంథాలోనే పోలీసులను అడ్డంగా పెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని హితవు పలికారు. వైసీపీ అల్లరి మూకల దాడి పై పోలీసు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదని అన్నారు.

స్థానిక సంస్థల్లో గెలవడం కోసం పథకాల్లో కోత పెడతామంటూ ప్రజలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇలాంటి వారికి ఓటు వేశామా అనే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలతో తిట్టించి శునకానందం పోందుతున్న జగన్‌కు చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని చూసి భయపడే సిఎం అసమర్థుడవుతాడని అన్నారు. జగన్ సిఎంగా పనిరాడని ఆనాడు చెప్పిన మాటలే నిజం అవుతున్నాయని ఆరోపించారు. నక్కజిత్తుల రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ఎన్ఆర్సీపై అవగాహన లేని డిప్యూటీ సీఎం మత విద్వేశాలను సృష్టించడం తగదని చెప్పారు.First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు