ఆ సీటు ఎవరికి ? బాలకృష్ణను చంద్రబాబు పట్టించుకుంటారా ? టీడీపీలో ఆసక్తికర చర్చ

కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలోకి రానుండటంతో... ఆయనకే ఈ సారి కనిగిరి ఎమ్మెల్యే సీటు దక్కుతుందనే టాక్ మొదలైంది. బాలకృష్ణ స్నేహితుడైన కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మాత్రం మరోసారి ఈ సీటు తనదే అని ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: March 2, 2019, 7:24 PM IST
ఆ సీటు ఎవరికి ? బాలకృష్ణను చంద్రబాబు పట్టించుకుంటారా ? టీడీపీలో ఆసక్తికర చర్చ
నందమూరి బాలకృష్ణ
news18-telugu
Updated: March 2, 2019, 7:24 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్న చంద్రబాబు... సీటు దక్కని నేతలను బుజ్జగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోలేకపోయిన నాయకులకు మరో రకంగా అవకాశం ఇస్తానని హామీ ఇస్తున్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా తప్పించి వేరే వారికి సీటిచ్చే ఆలోచన చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... ఎవరినీ నొప్పించకుండా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ సీటు విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలోకి రానుండటంతో... ఆయనకే ఈ సారి కనిగిరి ఎమ్మెల్యే సీటు దక్కుతుందనే టాక్ మొదలైంది. అయితే కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కదిరి బాబూరావుకు ఈ విషయం ఆగ్రహం కలిగించింది. బాలకృష్ణ స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న కదిరి బాబూరావు... గత ఎన్నికల్లో ఆయన సహకారంతోనే టీడీపీ టికెట్ దక్కించుకున్నారనే టాక్ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై బాలకృష్ణ చంద్రబాబుతోనూ చర్చించారని సమాచారం. అయినా ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలో చేరుతుండటంతో... కనిగిరి సీటు కదిరి బాబూరావుకు దక్కకుండా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఈ సారి ఎన్నికల్లో కదిరి బాబూరావు గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు బాలకృష్ణ వివరించారని... ఇందుకు సంబంధించి సర్వే నివేదికలను కూడా బాలయ్య ముందు ఉంచారని తెలుస్తోంది. ఈ కారణంగానే బాలకృష్ణ కూడా కనిగిరి సీటును బాబూరావుకు ఇవ్వాలని పట్టుబట్టడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కదిరి బాబూరావు మాత్రం ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలో చేరినా చేరకపోయినా... కనిగిరి సీటు తనదే అని ధీమాగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి... గత ఎన్నికల్లో తన స్నేహితుడికి టికెట్ ఇప్పించుకోవడంలో విజయం సాధించిన బాలకృష్ణ... మరోసారి స్నేహితుడి కోసం బావపై ఒత్తిడి తీసుకొస్తారా లేక బావ మాటకే సై అంటారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.First published: March 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...