లోక్‌సభ ఎన్నికల బరిలో జేఎన్‌యూ ఫైర్ బ్రాండ్..

Kanhaiah Kumar Contesting From Begusarai : రాబోయే ఎన్నికల్లో బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరు గెలవబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. కన్హయ్య గనుక ఇక్కడినుంచి గెలుపొందితే వామపక్షాలకు అది బిగ్ బూస్టింగ్ అనే చెప్పాలి.

news18-telugu
Updated: March 29, 2019, 6:55 PM IST
లోక్‌సభ ఎన్నికల బరిలో జేఎన్‌యూ ఫైర్ బ్రాండ్..
కన్హయ్య కుమార్(File)
  • Share this:
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన అభ్యర్థిత్వాన్ని సీపీఐ ఖరారు చేసింది. సీపీఎం కూడా కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచే అవకాశం ఉంది. నిజానికి బీహార్‌లో మహాకూటమి తరుపున కన్హయ్య కుమార్ బెగుసరాయ్ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ నేత్రుత్వంలోని కూటమి వామపక్షాలను విస్మరించి.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ఇక్కడ పోటీకి నిలిపింది. దీంతో సీపీఐ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ బరిలో దిగుతున్నారు.

తమను విస్మరించి కాంగ్రెస్-ఆర్జేడీ జతకట్టడంపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ తమను విస్మరించిందని ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న గిరిరాజ్ సింగ్‌కు కన్హయ్య కుమార్ ధీటైన అభ్యర్థి కాలేడని ఆర్జేడీ, కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే తొలుత కన్హయ్య కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చిన ఆ పార్టీలు.. ఆ తర్వాత అక్కడ అభ్యర్థిని పోటికి నిలిపాయి.మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో బెగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎవరు గెలవబోతున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. కన్హయ్య గనుక ఇక్కడినుంచి గెలుపొందితే వామపక్షాలకు అది బిగ్ బూస్టింగ్ అనే చెప్పాలి.

First published: March 24, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading