Congress: సోనియాగాంధీ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు అతడేనా ? అసలేం జరుగుతోంది ?

సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)

Congress News: సోనియా కుటుంబానికి అత్యంత విధేయుల్లో ఒకరైన కమల్‌నాథ్‌కు ఈ పదవి అప్పగిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

  • Share this:
    సోనియాగాంధీ తరువాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేది ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ గాంధీ విముఖంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ పదవిని ఈ సారి గాంధీ కుటుంబయేతరులకు ఇవ్వాలని సోనియా, రాహుల్ భావిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక నేత పేరు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ముందుకు వచ్చింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమాజీ మంత్రి కమల్‌నాథ్‌ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

    తాజాగా ఆయన సోనియాగాంధీతో పలుసార్లు భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా కుటుంబానికి అత్యంత విధేయుల్లో ఒకరైన కమల్‌నాథ్‌కు ఈ పదవి అప్పగిస్తారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు సోనియాను కమల్‌నాథ్ కలవడం వెనుక అసలు కారణం వేరే ఉందని.. యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసమే ఆయన సోనియాగాను కలిశారనే టాక్ వినిపిస్తోంది.

    2022లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలతో కలిసి కాంగ్రెస్ పొత్తు ఉండేలా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం ఆ రెండు పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండే కమల్‌నాథ్‌ను రంగంలోకి దించబోతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే సోనియా, రాహుల్, ప్రియాంకలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చల తరువాత కాంగ్రెస్ ఆలోచనలు మారుతున్నాయని.. ఈ క్రమంలోనే కమల్‌నాథ్ పేరు తెరపైకి వచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: