మధ్యప్రదేశ్‌ లో‌క్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 29 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.

news18-telugu
Updated: June 28, 2019, 4:36 PM IST
మధ్యప్రదేశ్‌ లో‌క్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాదే బాధ్యత
మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్
  • Share this:
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తాను నైతిక బాధ్యతవహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేతలెవరూ బాధ్యతవహించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న కథనాల నేపథ్యంలో కమల్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.

మధ్యప్రదేశ్‌లో పార్టీ ఓటమికి వ్యక్తిగతంగా తాను బాధ్యుడని భావిస్తున్నానని కమల్ నాథ్ పేర్కొన్నారు. పార్టీ ఓటమికి ఇంకా ఎవరెవరు కారణమో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు.


2018 ఏప్రిల్‌లో కమల్ నాథ్ మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో డిసెంబరు మాసంలో ఆయన ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. అక్కడ 15 ఏళ్ల తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికార పగ్గాలు హస్తగతం చేసుకుంది. అయితే నాలుగు మాసాల వ్యవధిలోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది.
Published by: Janardhan V
First published: June 28, 2019, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading