KALVAKUNTLA KAVITHA TO FILE NOMINATION AS MLC FROM NIZAMABAD BS
నేడు ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్..?
కవిత(ఫైల్ ఫోటో)
ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడే అధికారిక ప్రకటన, కవిత నామినేషన్ చకచకా జరిగిపోతాయని వెల్లడిస్తున్నాయి.
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి.. రాజ్యసభ ఎన్నికల్లో ఊసెత్తని పార్టీ.. దీంతో సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆమె కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. దీంతో మళ్లీ ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయబోరా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. అవన్నీ ఊహాగానాలేనని తేలిపోనున్నాయి. ఆమె మళ్లీ పొలిటికల్‌గా స్ట్రాంగ్ అవ్వనున్నారు. ఓడిన నిజామాబాద్ గడ్డమీది నుంచే ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, నేడే అధికారిక ప్రకటన, కవిత నామినేషన్ చకచకా జరిగిపోతాయని వెల్లడిస్తున్నాయి.
అంతేకాదు.. ఎమ్మెల్సీగా ఆమె గెలుపు దాదాపు ఖరారు అయినట్లేనని, కవితను కేబినెట్లోకి కూడా తీసుకునే ఛాన్స్ ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే.. తెలంగాణలో తొలి మహిళా ఎమ్మెల్సీగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం... ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే... ఆమె రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.