Home /News /politics /

KALVAKUNTLA KAVITHA TAKES UP NEW SLOGAN TO COUNTER BJPS JAI SHRIRAM KNOW WHAT IT IS BA KNR

Kalvakuntla Kavitha: బీజేపీ ‘జై శ్రీరామ్‌’కు కౌంటర్‌గా కల్వకుంట్ల కవిత కొత్త ‘మంత్రం’

కల్వకుంట్ల కవిత (File)

కల్వకుంట్ల కవిత (File)

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొత్త నినాదం ఎంచుకుందా? సహజ నినాదమైన ‘జై తెలంగాణ’కు అదనంగా ఇప్పుడు కొత్తగా ‘జై హనుమాన్’ మంత్రాన్ని అందుకుందా?. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ఈ క్యాంపెయిన్‌కు బీజం వేశారు.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొత్త నినాదం ఎంచుకుందా? సహజ నినాదమైన ‘జై తెలంగాణ’కు అదనంగా ఇప్పుడు కొత్తగా ‘జై హనుమాన్’ మంత్రాన్ని అందుకుందా?. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా ఈ క్యాంపెయిన్‌కు బీజం వేశారు. కొండగట్టు అంజన్న సాక్షిగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతామని వెల్లడించారు. మొన్న జగిత్యాల జిల్లా కొండగట్టును సందర్శించుకున్న కవిత మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. సహజంగా ‘జై శ్రీరామ్ అనేది బీజేపీ నినాదం. కానీ ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీరామ భక్తుడైన హనుమాన్ ని అస్త్రంగా పెట్టారు. జై హనుమాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.

    ఇకపోతే బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హిందూ నినాదంతో అటు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థికి విజయం సాధించిపెట్టారు. ఇటు జీహెచ్ఎంసీలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఝలక్ ఇచ్చారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకమని, ఆ పార్టీ ఎంఐఎంకు కొమ్ము కాస్తుందంటూ ప్రతి సభలోనూ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రసంగాన్ని తిప్పికొట్టే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఫిబ్రవరి 26 రోజున రోజున కొండగట్టు దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, అంజన్న దర్శనం చేసుకొని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అంజన్న దేవాలయాన్ని యాద్రాద్రి తరహాలో మారుస్తామని దీనికి సంబంధించిన అన్ని విషయాలు సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని చెప్పారు. అంజన్న దేవాలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని చెప్పి 15 రోజులు కాకుండానే మళ్లీ రేపు (మార్చి 9) దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు కు చేరుకొని రామకోటి స్తూపానికి శంకుస్థాపన చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా ఒక్కసారి కూడా అంజన్న దేవాలయాన్ని దర్శించుకోని కవిత 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు రావడం వెనుక ఏదో రాజకీయ మార్పు ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.



    అయితే, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు పక్కనపెట్టి దేవాలయాన్ని అన్ని పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా డెవలప్మెంట్ కొరకు పాటుపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పర్యటనల వెనుక అసలు కథ ఏంటో అనేది ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bjp, Kalvakuntla Kavitha, Karimnagar, Nizamabad, Telangana, Telangana bjp, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు