Home /News /politics /

కవితకి దక్కబోయే పదవి ఏంటి ?.. రాష్ట్రమా ? లేక కేంద్రమా ?.. తేలేది ఆ రోజే ?

కవితకి దక్కబోయే పదవి ఏంటి ?.. రాష్ట్రమా ? లేక కేంద్రమా ?.. తేలేది ఆ రోజే ?

కల్వకుంట్ల కవిత ( ఫైట్ ఫోటో)

కల్వకుంట్ల కవిత ( ఫైట్ ఫోటో)

గతంలో విపక్షాలను విమర్శించే విషయంలో కేటీఆర్, హరీశ్ రావు తరహాలో ఎంతో యాక్టివ్‌గా దూసుకెళ్లిన కవిత.. ఇప్పుడు మాత్రం ఆ విషయంలో అంత దూకుడును ప్రదర్శించడం లేదనే వాదన ఉంది.

    టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవితకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేక ఆమెను రాజ్యసభకు పంపుతారా ? అన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత (Kavitha)  పదవీకాలం కొద్దినెలల క్రితమే ముగిసింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ ఈసారి ఆమెకు మళ్లీ ఎమ్మెల్సీగా ఛాన్స్ వస్తే.. ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి రాజ్యసభ సభ్యుడిగా(Rajya Sabha)  ఉన్న బండ ప్రకాశ్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో.. ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపుతారనే కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అసలు కవిత విషయంలో కేసీఆర్ (KCR) ఆలోచన ఏమిటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    గతంలోనూ కవితను చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి దిగే అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే కవితకు ఈసారి ఏ పదవి దక్కనుందనే అంశంపై ఈ నెల 23న క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఖాళీ అయిన 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ నవంబర్ 23. ఆ రోజున కవిత మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా లేదా అన్నది తెలుస్తోంది. ఒకవేళ ఆమెకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం లభించకపోతే.. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు భావించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    అయితే ఈసారి కవితకు ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తే మాత్రం.. ఆమెకు కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో రాజకీయాల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన కవిత.. ఇప్పుడు అంత యాక్టివ్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. కేవలం నిజామాబాద్ జిల్లాకు మాత్రమే ఆమె పరిమితమవుతున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో మాత్రమే ఎక్కువగా పాల్గొంటున్నారు.

    Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

    K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

    గతంలో విపక్షాలను విమర్శించే విషయంలో కేటీఆర్, హరీశ్ రావు తరహాలో ఎంతో యాక్టివ్‌గా దూసుకెళ్లిన కవిత.. ఇప్పుడు మాత్రం ఆ విషయంలో అంత దూకుడును ప్రదర్శించడం లేదనే వాదన ఉంది. అయితే కవితకు రాజ్యసభ సీటు ఇస్తే.. బీసీ స్థానాన్ని కేసీఆర్ తన కుటుంబసభ్యులకు ఇచ్చారనే ప్రచారం మొదలవుతుందనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి కవితకు ఎమ్మెల్సీ సీటు వస్తుందా లేదా అన్నది ఈ నెల 23న తేలుతుంది. అలా జరగకపోతే ఆమె రాజ్యసభ సీటు రేసులో ఉంటారా లేదా అనే కొత్త చర్చ మొదలవుతంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Kalvakuntla Kavitha, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు