(P.Mahender,News18,Nizamabad)
తెలంగాణలో ఎమ్మెల్సీల భర్తీ (MLC Elections) ప్రక్రియలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) అనూహ్య ఎత్తుగడలు అమలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీని, మాజీ కలెక్టర్ లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన సీఎం.. తన కూతురు కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) మాత్రం ఆ పదవి ఇచ్చేందుకు నిరాకరించారు. కొద్ది కాలంపాటే ఎమ్మెల్సీగా ఉన్న కవితకు మరోసారి నిజామాబాద్ జిల్లా నుంచే అవశం దక్కుతుందని అంతా భావించారు. దీంతో ఎమ్మెల్సీ ఆశించిన వారు ఆశలు వదులుకున్నారు. కానీ అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితను తప్పించి మాజీ ఎమ్మెల్సీ లలితకు నిజాంబాద్ స్థానిక ఎమ్మెల్సీ సీటు కన్ఫామ్ చేశారు కేసీఆర్. తద్వారా కవిత రాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లయింది. కవితను రాజ్యసభకు పంపడంలో కేసీఆర్ వ్యూహమేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ గా ఆవకాశం కల్పించి.. కవితను పెద్దల సభకు పంపేందుకు సిద్దం చేసారని తెలుస్తోంది..
తెలంగాణ లో కొత్తగా పార్టీ పెట్టిన వైయస్ షర్మిల పోటీ గా మహిళా నేత కవిత ఉంటుందని ప్రచారం కానీ కేసీఆర్ వ్యూహాన్ని ఎందుకు మార్చుకున్నారు? అని గులాబీ శ్రేణల్లోనూ చర్చ నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో జాగృతి అధ్యక్షురాలిగా ఎమ్మేల్సీ కవితన తన ప్రదాన్యతను చాటుకుంది. బతుకమ్మగా తెలంగాణ అడపడుచులకు సుపరిచితురాలుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి వచ్చి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. పార్లమెంటులో తెలంగాణా నుంచి తన గొంతుకను వినిపించి శభాష్ అనిపించుకున్నారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దీంతో స్థాబ్దుగా ఉన్నా కవిత 2020 లో వచ్చిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.
ఎమ్మెల్సీ హోదాలో రాష్ట్ర రాజకీయాల్లో క్రియశీలంగా వ్యవహరించారు కవిత. నిజామాబాద్ జిల్లా ప్రజల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సీఎం కేసీఆర్ క్యాబినేట్ లో మంత్రి అవుతుందని కవిత ఆనుచరులు, పార్టీ శ్రేనులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా మరోసారి ఎమ్మెల్సీగా ఉంటుందనుకున్న కవిత ఒక్కసారిగా పెద్దల సభకు వెళ్తుందని ప్రచారం రావడంతో జిల్లా స్థానిక నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీ నుంచి తప్పుకోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాష్ ను ఎమ్మెల్సీ రేసులో దించారు. బండకు మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజిక వర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురాతను వాడరని తెలుస్తుంది. అయితే ఎమ్మేల్సీ కవితను ఎమ్మెల్సీ నుంచి తప్పించి రాజ్యసభకు పంపడం లో కెసిఆర్ వ్యూహమేంటి? రాష్ట్ర రాజకీయాల నుంచి కవిత ను తప్పించి.. రాజ్యసభకు ఎందుకు పంపుతున్నారనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kalvakuntla Kavitha, Mlc elections, Nizamabad, Nizamabad District, Trs