Home /News /politics /

KALVAKUNTLA KAVITHA MAY BECOME TELANGANA MINISTER IF SHE NOT GET RAJYA SABHA SEAT FROM TRS AK

టీఆర్ఎస్‌లో కవితపై కొత్త చర్చ... ఆ పదవి ?

కల్వకుంట్ల కవిత (File)

కల్వకుంట్ల కవిత (File)

కవితను రాజ్యసభకు పంపకూడదని కేసీఆర్ నిర్ణయించుకుంటే... ఆమె విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    రాజ్యసభలో తెలంగాణ నుంచి ఖాళీ కాబోయే రెండు సీట్లను దక్కించుకోనున్న టీఆర్ఎస్... వాటిని ఎవరికి కేటాయిస్తుందనే విషయం సస్పెన్స్‌గా మారింది. కేశవరావుకు మళ్లీ రెన్యువల్ ఉంటుందా ? లేదా ? అనే అంశంతో పాటు కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను రాజ్యసభకు పంపిస్తారా ? లేదా అనే అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. అయితే టీఆర్ఎస్‌లో నెలకొన్న సైలెన్స్‌ను బట్టి చూస్తే... కవితకు రాజ్యసభ సీటు లేనట్టే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కవితకు కేసీఆర్ రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తే... ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు, కామెంట్స్ చేసేవారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    కవిత పెద్దల సభకు వెళ్లడం ఖాయమైతే... నిజామాబాద్‌లో ఇప్పటికే ఆ హడావిడి కనిపించేదేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటివేవీ లేకపోవడంతో... కవిత రాజ్యసభ సీటు దాదాపుగా లేనట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కవితను రాజ్యసభకు పంపకూడదని కేసీఆర్ నిర్ణయించుకుంటే... ఆమె విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    టీఆర్ఎస్‌లో కవితపై కొత్త చర్చ... ఆ పదవి ? | Kalvakuntla Kavitha may become telangana minister if she not get rajya sabha seat from trs ak
    కేసీఆర్, కవిత (ఫైల్ ఫోటో)


    కవితను మరో నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంచడం సాధ్యంకాకపోవచ్చని... కాబట్టి ఆమెను రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్ చేయొచ్చనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాదిలోపే కేటీఆర్‌ను సీఎం చేయాలనే యోచనలో ఉన్న కేసీఆర్... కేటీఆర్ కేబినెట్‌లో కవితను మంత్రిని చేసే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కవితకు రాజ్యసభ సీటు దక్కకపోతే... ఆ తరువాత ఆమె రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Kalvakuntla Kavitha, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు