రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. మరి హరీష్ రావు ఎక్కడ?

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజక్టు కోసం కేంద్రం ఏమి చేసిందో.. కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌ రావును అడిగి తెలుసుకోవాలని, అసలు ఆయన ఎక్కడ కనిపించడం లేదని లక్ష్మణ్ అన్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 19, 2019, 2:55 PM IST
రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం.. మరి హరీష్ రావు ఎక్కడ?
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
  • Share this:
కాళేశ్వరం.. టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు.. ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు.. మాజీ మంత్రి హరీష్ రావు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ప్రాజెక్టు పూర్తి కావడానికి అహర్నిషలు పాటుపడ్డారు. అయితే, ముందస్తు ఎన్నికల అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కకపోగా, ఆయన నిర్వహించిన శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. ఈ మధ్యే అక్కడికి వెళ్లి ప్రాజెక్టును సమీక్షించారు. అయితే, ప్రాజెక్టు కోసం నిరంతరం శ్రమించిన హరీష్ రావు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఊసే వినిపించడం లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రస్తుతం హరీష్ రావు ఎక్కడా కనిపించడం లేదని అడిగారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కాళేశ్వరం ప్రాజక్టు కోసం కేంద్రం ఏమి చేసిందో.. కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌ రావును అడిగి తెలుసుకోవాలని, అసలు ఆయన ఎక్కడ కనిపించడం లేదని అన్నారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించకపోవటం‌ బాధాకరమని అన్నారు.

ఇక, ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పిలవకపోవటం దురదృష్టకరమని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది పదవుల కోసం రాజీపడిన చరిత్ర విమర్శించారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>