కేసీఆర్‌కు హరీశ్‌రావు అభినందనలు..కాళేశ్వరంపై ప్రశంసలు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సైతం ఇంజినీర్లను అభినందించారు. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: April 24, 2019, 6:57 PM IST
కేసీఆర్‌కు హరీశ్‌రావు అభినందనలు..కాళేశ్వరంపై ప్రశంసలు
ఉప్పొంగుతున్న కాళేశ్వరం నీళ్లు
  • Share this:
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు ప్రకటించిప్పటి నుంచీ ఎన్నో రికార్డులు సాధించిన కాళేశ్వరం బుధవారం మరో మైలు రాయిని అందుకుంది. ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి పంపు వెట్‌ రన్‌ నందిమేడారంలో విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు.

ప్రస్తుతం నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌కు చేరనున్నాయి. లక్ష్మీపూర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకుంటాయి.


కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్‌ రన్‌ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి అభినందించారు. అటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సైతం ఇంజినీర్లను అభినందించారు. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ పలు జిల్లాల్లో రిజర్వాయర్లు ఏర్పాటుచేశారు. దాదాపు 151 టీఎంసీకు పైగా గోదావరి జలాలోనూ ఆ జలాశయాల్లో నిల్వచేస్తారు. ఇందుకోసం ప్రాజెక్టు పొడవునా 82 మోటర్లు ఏర్పాటుచేశారు. వీటిలో 139 మెగావాట్ల భారీ మోటర్‌‌ని కూడా వినియోగిస్తున్నారు. నంది మేడారం పంపుహౌజ్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను అమరుస్తున్నారు. వీటిలో ఏడింటికిగాను నాలుగు డ్రైరన్ పూర్తి చేసుకొని, వెట్‌‌రన్‌‌కు సిద్ధంగా ఉన్నాయి. నాలిగింటిలో ఇవాళ ఒకటి వెట్‌రన్‌ విజయవంతమయింది. మిగతా మూడు పంపుల వెట్‌రన్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.
First published: April 24, 2019, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading