Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    మంత్రి పదవి ఇస్తా వచ్చేయ్.. వంగవీటికి కేఏ పాల్ ఆఫర్

    సంచలన వ్యాఖ్యలతో కేఏ పాల్ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. అంతర్జాతీయ సెలబ్రిటీల నుంచి లోకల్ లీడర్ల వరకు ఎవ్వరినీ వదలరాయన. తాజాగా అలాంటి సెన్సేషనల్ కామెంట్సే చేశారు పాల్.

    news18-telugu
    Updated: January 22, 2019, 5:51 PM IST
    మంత్రి పదవి ఇస్తా వచ్చేయ్.. వంగవీటికి కేఏ పాల్ ఆఫర్
    కేఏ పాల్, వంగవీటి రాధాకృష్ణ
    • Share this:
    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజు మీదున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల కప్పదాట్లు కొనసాగుతున్నాయి. రోజుకో నేత పార్టీ మారుతూ.. రాజకీయాల్లో వేడి పెంచుతున్నారు. తాజాగా, విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ.. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపించిన వంగవీటి.. టీడీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణకు ప్రముఖ క్రైస్తవ మతప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

    వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి.. ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీలో చేరితో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రిని కూడా చేస్తానని ఆఫర్ ఇచ్చారు. దీనికి తోడు వంగవీటికి మరో ఆఫర్ కూడా ఇచ్చారు పాల్. ఒకవేళ తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైతే.. రూ. 100కోట్లు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఈ మొత్తాన్ని వంగవీటి రంగా పేరిట కొనసాగుతున్న చారిటీకి విరాళంగా ఇస్తానని చెప్పారు. తన తండ్రిని టీడీపీ చంపిందని ఆరోపించిన వంగవీటి రాధాకృష్ణ.. ఇప్పుడదే పార్టీలో చేరితే కాపులు ఎన్నటికీ క్షమించబోరని హెచ్చరించారు.

    ఇక.. ముఖ్యమంత్రం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌లపైనా సంచలన ఆరోపణలు చేశారు పాల్. వారిద్దరి నుంచీ తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానెళ్లపైనా పాల్ పిర్యాదు చేశారు. ఈ దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

     

    ఇది కూడా చూడండి:

    First published: January 22, 2019, 5:51 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading