హోమ్ /వార్తలు /రాజకీయం /

ట్రక్కు ఎఫెక్ట్.. టీఆర్ఎస్ 'కారు' గుర్తుకు సవరణలు.. పరిశీలిస్తామన్న ఈసీ

ట్రక్కు ఎఫెక్ట్.. టీఆర్ఎస్ 'కారు' గుర్తుకు సవరణలు.. పరిశీలిస్తామన్న ఈసీ

సీఎం కేసీఆర్, కారు గుర్తు

సీఎం కేసీఆర్, కారు గుర్తు

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తును కేటాయించింది. ఇది కారు గుర్తును పోలి ఉండటంతో చాలాచోట్ల టీఆర్ఎస్‌కు రావాల్సిన ఓట్లు ట్రక్కుకు పడ్డాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇంకా చదవండి ...

    టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు 'కారు'లో సవరణలు చేయాలంటూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన సూచనలను ఈసీ పరిగణలోకి తీసుకుంది. ఇకనుంచి ఎన్నికల్లో కారు గుర్తును 'బోల్డ్' చేయాలని కోరుతూ.. సవరణలు చేసిన గుర్తును ఈసీకి వినోద్ శుక్రవారం సమర్పించారు. గుర్తును బోల్డ్ చేయడం ద్వారా మరింత స్పష్టంగా కనిపిస్తుందని వినోద్ ఈసీకి సూచించారు. వినోద్ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న ఈసీ దాన్ని పరిశీలించనుంది.


    ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కారు గుర్తు సరిగా కనిపించక.. వృద్దులు, కొంతమంది ఓటర్లు అయోమయానికి గురయ్యారని డిసెంబర్ 27న ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలపై కారు గుర్తు స్పష్టంగా కనిపించకపోవడం.. అదే గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తు, ఇస్త్రీ పెట్టె గుర్తులతో ఓటర్లు గందరగోళపడటం గురించి ఆయన ఈసీకి వివరించారు. ఈ నేపథ్యంలోనే గుర్తులో సవరణలు చేయాల్సిందిగా కోరారు.


    ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీకి ఎన్నికల సంఘం ట్రక్కు గుర్తును కేటాయించింది. ఇది కారు గుర్తును పోలి ఉండటంతో చాలాచోట్ల టీఆర్ఎస్‌కు రావాల్సిన ఓట్లు ట్రక్కుకు పడ్డాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని తెలివిగా ఉపయోగించుకున్న సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ.. చాలాచోట్ల తమ అభ్యర్థుల పేర్లను కలిగినవారినే వారి అభ్యర్థులుగా బరిలో దింపిందని ఎంపీ వినోద్ ఆరోపించారు. ట్రక్కు గుర్తు కారు గుర్తులా ఉండటం.. అభ్యర్థి పేరు ఒకటే కావడంతో ఓటర్లు అయోమయానికి గురై సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఓటేశారని అన్నారు. ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా ఉండేందుకే గుర్తులో సవరణలు చేయాల్సిందిగా ఈసీకి సూచించామని తెలిపారు.


    K Chandrasekhar Rao asks to modify symbol of car


    (సవరణలు చేసి ఈసీకి ఎంపీ వినోద్ సమర్పించిన కారు గుర్తు..)

    First published:

    Tags: CM KCR, Telangana, Telangana Election 2018, Trs