AP Elections: కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

news18-telugu
Updated: March 26, 2019, 5:39 AM IST
AP Elections: కేఏ పాల్ నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు
కే ఏ పాల్ (File)
  • Share this:
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చెయ్యాలని భావించిన ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నరసాపురం ఎంపీ స్థానంతో పాటు భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే నరసాపురంలో సరైన సమయంలోనే నామినేషన్‌ వేసిన ఆయన.. భీమవరంలో మాత్రం ఆలస్యంగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. సోమవారం నామినేషన్‌ వేసేందుకు నరసాపురం వచ్చిన పాల్‌.. రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తును అందజేశారు. అక్కడి నుంచి ఉరుకులు పరుగులపై వెళ్లిన ఆయన మధ్యాహ్నం 3.45 నిమిషా లకు భీమవరం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలు అన్ని పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించే సరికి సమయం దాటిపోవడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను తిరస్కరించారు. నామినేషన్లు తీసుకునేందుకు 4గంటల లోపు రావాలని అయితే 4.10గంటలకు రావడంతో తీసుకోలేదని కేఏ పాల్ తెలిపారు.

నర్సాపురంలో నామినేషన్‌ను వేయడంలో కొద్దిగా ఆలస్యం అయ్యిందని.. అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని పాల్‌ అన్నారు. అయితే.. తాను గెలుస్తానన్న భయంతో చంద్రబాబు, జగన్‌, పవన్‌ కుట్రపన్ని ఆలస్యంగా భీమవరం చేరుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 
First published: March 26, 2019, 5:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading