జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా...అదేబాటలో ముంబై కాంగ్రెస్ చీఫ్

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సింధియా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

news18-telugu
Updated: July 8, 2019, 8:59 AM IST
జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా...అదేబాటలో ముంబై కాంగ్రెస్ చీఫ్
జ్యోతిరాదిత్య సింథియా (ఫైల్ ఫొటో)
  • Share this:
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సింధియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ముంబయి కాంగ్రెస్‌ చీఫ్‌ మిలింద్‌ దేవ్‌రా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రజా నిర్ణయాన్ని అంగీకరిస్తూనే... కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు. మధ్య ప్రదేశ్‌లో పార్టీ దారుణ పరాజయానికి తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు సింధియా పేర్కొన్నారు. తన రాజీనామాను రాహుల్ గాంధీకి పంపినట్లు సింధియా తెలిపారు.

‘‘ప్రజల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. రాజీనమా పత్రాన్ని ఇప్పటికే రాహుల్‌ గాంధీకి పంపించాను. నాపై నమ్మకముంచి నాకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు, పార్టీకి సేవ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అని సింధియా ట్వీట్ చేశారు.

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సింధియా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు సింధియాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఆ రాష్ట్రంలో మొత్తం 80సీట్లకు కాంగ్రెస్ ఒకే ఒక చోట గెలిచింది. మిలింద్ దేవ్‌రా దక్షిణ ముంబై నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. యూపీకి చెందిన కేశవ్ చంద్ యాదవ్ కూడా యువజన కాంగ్రెస్ పదవిక రాజీనామా చేశారు.
Published by: Sulthana Begum Shaik
First published: July 8, 2019, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading