Home /News /politics /

JUSTICE BEDI PANEL FINDS 3 OF 17 GUJARAT ENCOUNTERS FAKE DENIES SELECTIVE ELIMINATION OF MUSLIMS DURING 2002 06

గుజరాత్ ఎన్‌కౌంటర్స్‌పై కీలక నివేదిక : 17 ఎన్‌కౌంటర్లలో 3 ఫేక్!

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Gujarat Encounters : గుజరాత్‌లో గోద్రా అల్లర్లు చెలరేగిన 2002లో సాయుధ బలగాల అడిషనల్ డీజీపీతో పాటు ఇంటలిజెన్స్ డీజీపీగా శ్రీకుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముస్లింల హత్యలపై సుప్రీం నియమించిన కమిటీకి ఆయన రెండు నివేదికలు సమర్పించారు.

ఇంకా చదవండి ...
    2002-2006 మధ్య కాలంలో గుజరాత్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ హెచ్ఎస్ బేడీ కమిటీ తుది నివేదిక సమర్పించింది. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ముస్లిం అతివాదులను ఎన్‌కౌంటర్ల పేరుతో ప్రత్యేకంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలను కమిటీ కొట్టిపారేసింది.గుజరాత్‌లో కొంతమంది ముస్లిం అతివాదులను కావాలని టార్గెట్ చేసి ఫేక్ ఎన్‌కౌంటర్స్ చేశారని గుజరాత్ డీజీపీ ఆర్‌బి శ్రీకుమార్ గతంలో ఇచ్చిన నివేదికను బేడీ కమిటీ తప్పు పట్టింది. ముస్లింలను ఫేక్ ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న ఆరోపణలను కూడా తిరస్కరించింది.

    కాగా, గుజరాత్‌లో గోద్రా అల్లర్లు చెలరేగిన 2002లో సాయుధ బలగాల అడిషనల్ డీజీపీతో పాటు ఇంటలిజెన్స్ డీజీపీగా శ్రీకుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముస్లింల హత్యలపై సుప్రీం నియమించిన కమిటీకి ఆయన రెండు నివేదికలు సమర్పించారు. కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరై తన వాంగ్మూలం కూడా వినిపించారు.ముస్లింల హత్యాకాండ వెనుక ప్రభుత్వమే ఉందని, అందుకు తాను సహకరించని కారణంగా తన పదోన్నతి కూడా కల్పించలేదని ఆ సందర్భంలో శ్రీకుమార్ కమిటీకి తెలిపారు. అయితే తాజా కమిటీ నివేదిక మాత్రం ఆయన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.

    2002-2006 మధ్య కాలంలో మొత్తం 17 ఎన్‌కౌంటర్స్ జరగ్గా.. ఇందులో 14 వాటిల్లో గుజరాత్ పోలీసులకు కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. పోలీసులపై చర్యలకు ఆదేశించడానికి ఈ కేసుల్లో వారి ప్రమేయం ఏమి లేదని వెల్లడించింది. మిగతా మూడు ఎన్‌కౌంటర్‌లను మాత్రం ఫేక్‌గా గుర్తించింది. వీటిని హత్య కేసులుగా నమోదు చేస్తూ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి చేత విచారణకు కమిటీ ఆదేశించింది. ఈ మూడు ఎన్‌కౌంటర్లలో కాసిం జాఫర్, సమీర్‌ఖాన్, హజి హజి ఇస్మాయిల్‌ అనే ముస్లింలను అప్పట్లో పోలీసులు మట్టుబెట్టారు.


    ఎన్‌కౌంటర్ కేసులకు సంబంధించి ఫిబ్రవరి, 2018లోనే సుప్రీంకోర్టుకు జస్టిస్ బేడీ తుది నివేదిక సమర్పించారు. ఆ నివేదికకు సంబంధించిన ఆర్డర్ కాపీలను పిటిషనర్లకు అందజేయాల్సిందిగా సీజేఐ రంజన్ గొగొయ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ బీజీ వర్గెసె‌తో పాటు గీత రచయిత జావెద్ అక్తర్‌లకు ఆర్డర్ కాపీలు అందజేసినట్టు సమాచారం. గుజరాత్ ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాల్సిందిగా కోరుతూ వీరిద్దరు 2007లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం దీనిపై కమిటీ వేయగా.. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూ వస్తోంది.
    First published:

    Tags: Gujarat, Narendra modi, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు