జూపూడి వీర విధేయత.. మేం తప్పిపోయిన గొర్రెలం.. జగన్ యేసుక్రీస్తు.. విజయసాయిరెడ్డేమో...

Jupudi Prabhakar Rao | క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వైద్యం, విద్య అందిస్తున్నారని జూపూడి అన్నారు. అందుకే తప్పిపోయిన పిల్లాడు వచ్చినట్టుగా వైపీపీలోకి వచ్చామని చెప్పారు.

news18-telugu
Updated: October 9, 2019, 8:31 PM IST
జూపూడి వీర విధేయత.. మేం తప్పిపోయిన గొర్రెలం.. జగన్ యేసుక్రీస్తు.. విజయసాయిరెడ్డేమో...
వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావు
  • Share this:
ఏపీ ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జూపూడి ప్రభాకర్ రావు మళ్లీ వైసీపీ కండువా కప్పుకొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభాకర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్ రావ.. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి‌ను ఆకాశానికి ఎత్తేశారు. ‘రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ వస్తుందని ఆశించాం. ఓ వైపు ఆంధ్ర ఐరన్ మ్యాన్‌గా విజయసాయిరెడ్డి ఉన్నారు. మరోవైపు పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, మరో యాత్రలతో ప్రజల మధ్యలోనే ఉన్నారు. జగన్ అనేక బాధలను చవిచూసిన మెసయ్య (యేసుక్రీస్తు)లా ఉన్నారు. మేం తప్పిపోయిన గొర్రెల్లాగా అటూ ఇటూ వెళ్లి ఉండవచ్చు. కానీ, ఈ రాష్ట్రం సుపరిపాలన, అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటోంది. జగన్, విజయసాయిరెడ్డి అరమరికలు లేకుండా ముందుకు సాగుతున్నారు. దేశం నివ్వెరపోయేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఐదుగురు దళితులకు కేబినెట్‌లో స్థానం ఇచ్చారు. విప్‌గా కూడా దళితులకు అవకాశం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. దేశం మొత్తానికి ఇదో ఆదర్శంగా నిలిచింది.’ అని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాల పాలన రాష్ట్రంలో సువర్ణపాలన కాబోతోందని జూపూడి అన్నారు. ఇది జగన్‌తో ఉండి ఆయనకు సహకారం అందించాల్సిన సమయం అనే భావనతో టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు చెప్పారు. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో తరహాలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వైద్యం, విద్య అందిస్తున్నారని జూపూడి అన్నారు. అందుకే తప్పిపోయిన పిల్లాడు వచ్చినట్టుగా వైపీపీలోకి వచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలతో తొందరపడుతున్నారని జూపూడి అన్నారు. టీడీపీలోకి వెళ్లడం తాను చేసిన పొరపాటని చెప్పారు.

అంతరిక్షం నుంచి భూమికి దిగొచ్చిన వ్యోమగాములు..

First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading