జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున... వైఎస్ జగన్ ఓటు ఎవరికి ?

కొద్ది రోజులుగా పలువురు ప్రముఖులు వైసీపీ గుంటూరు లోక్‌సభ స్థానం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలుస్తుండటం రాజకీయవర్గాలతో పాటు సినీవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు, హీరో నాగార్జున ఈ సీటు కోసం వైసీపీ అధినేతను కలిశారనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: February 20, 2019, 3:29 PM IST
జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున... వైఎస్ జగన్ ఓటు ఎవరికి ?
జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ జగన్, అక్కినేని నాగార్జున
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... సీట్ల కోసం ఎవరికి వాళ్లు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొన్ని సీట్లు విషయంలో ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించే గుంటూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ తరపున గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆయనే మరోసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగానూ బలమైన అభ్యర్థి కావడంతో... గల్లా జయదేవ్‌ను మార్చే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు చేయకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.

ఇక ఈ స్థానంలో గల్లా జయదేవ్‌కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ఇంకా ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం వైసీపీ తరపున గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్య వ్యవహరిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా పలువురు ప్రముఖులు వైసీపీ గుంటూరు లోక్‌సభ స్థానం కోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కలుస్తుండటం రాజకీయవర్గాలతో పాటు సినీవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్‌ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు... గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని జగన్‌ను కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

మంగళవారం జగన్‌ను కలిసిన సినీనటుడు నాగార్జున సైతం తన మిత్రుడికి గుంటూరు టికెట్ ఇవ్వాలని జగన్‌ను కోరినట్టు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వైసీపీ గుంటూరు లోక్ సభ సీటు కోసం జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున పోటీ పడుతున్నారనే టాక్ మొదలైంది. ఇద్దరూ ఆర్థికంగా బలమైన వారే కావడంతో... వీరిలో ఎవరో ఒకరికి జగన్ గుంటూరు సీటు కేటాయించే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి గుంటూరు ఎంపీ టికెట్‌ విషయంలో జగన్ ఎవరి వైపు మొగ్గుచూపుతారో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>