Home /News /politics /

JUHU CELEBRITIES POLLING BOOTH POLLING OFFICIALS WERE CLICKING SELFIES SB

అదో సెలబ్రిటీ పోలింగ్ బూత్... సెల్ఫీల కోసం పోలీంగ్ సిబ్బంది క్యూ

భర్త మహేష్ భూపతితో కలిసి ఓటు వేసిన లారా దత్తా

భర్త మహేష్ భూపతితో కలిసి ఓటు వేసిన లారా దత్తా

జూహులో ఉన్న గాంధీ శిక్షణ్ భవన్ స్కూల్ పోలింగ్ బూత్‌ వద్ద అత్యధికంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా తరలివచ్చి ఓటు వేస్తున్నారు.

    మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. అయితే మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబైలో సెలబ్రిటీలు సైతం ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంధేరిలో ఉన్న జూహులో గాంధీ శిక్షణ్ భవన్ స్కూల్ పోలింగ్ బూత్‌ వద్ద అత్యధికంగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా తరలివచ్చి ఓటు వేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న పోలింగ్ సిబ్బంది వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున సెలబ్రిటీలంతా ఆ పోలింగ్ బూత్ వద్దకు చేరుకోవడంతో... అక్కడున్న ఓటర్లతో పాటు... పోలింగ్ సిబ్బందికూడా సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Bjp, Bollywood Movie, Bollywood news, Maharastra assembly election 2019, Maharastra news'

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు