బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత.. టీడీపీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యే..?

మొన్న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... తెలుగుదేశం పార్టీని  ఇంతలా ముంచేస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. రీసెంట్‌గా  టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకొని బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు. తాజాగా బీజేపీలో చేరేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ నిర్మాత రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: June 26, 2019, 3:54 PM IST
బీజేపీలోకి జూనియర్ ఎన్టీఆర్ నిర్మాత.. టీడీపీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యే..?
ఎన్టీఆర్ అరవింద సమేత
  • Share this:
మొన్న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... తెలుగుదేశం పార్టీని  ఇంతలా ముంచేస్తాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు. రీసెంట్‌గా  టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకొని బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మొన్నటి వరకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. వీళ్లు ఈ రకంగా పార్టీ మారతారని తెలుగు దేశం శ్రేణులు కూడా ఊహించలేకపోయాయి. అది మరక ముందే  పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత... అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకొని కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కూడా బీజేపీలో చేేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కాషాయ పార్టీలో చేరిన సుజనా చౌదరి..టీడీపీలో ఉన్న నేతలను ఒక్కొక్కరిగా బీజేపీలో  చేర్పించేందుకు వెనక ఉండి చక్రం తిప్పుతున్నారు.

Jr NTR Producer TDP MLA Vallabhaneni Vamsi Mohan May Join BJP,Vallabhaneni Vamsi,jr ntr,TDP MLA Vallabhaneni Vamsi Mohan,tdp gannavaram mla vallabhaneni vamsi mohan,TDP MLA Vallabhaneni Vamsi Mohan May Join BJP,tdp bjp jr ntr producer vallabhaneni vamsi mohan,jr ntr twitter,tollywood,telugu cinema,tollywood,telugu cinema,andhra pradesh news,andhra pradesh politics,బీజేపీ,టీడీపీ,టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్,బీజేపీలోకి వల్లభనేని వంశీ మోహన్,బీజేపీ వల్లభనేని వంశీ,బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న వంశీ మోహన్,కాషాయ కండువా కప్పుకోనున్న వంశీ మోహన్,
వల్లభనేని వంశీ,జూనియర్ ఎన్టీఆర్ (పైల్ ఫోటోస్)


గతంలో వల్లభనేని వంశీ మోహన్  జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ వంటి సినిమాను నిర్మించాడు. అంతేకాదు రవితేజతో ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్నినిర్మించాడు. గతంలో 2009లో విజయవాడ ఎంపీగా లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత 2014, తాజాగా 2019లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికయ్యారు. మొత్తానికి తెలుగు దేశం పార్టీకి అండగా ఉంటున్న సామాజిక వర్గ నేతలే ఒక్కొక్కరుగా సైకిల్ ను వీడడం టీడీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి  మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవ్వడం, 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో ఇక టీడీపీ పనైపోయిందని భావిస్తున్న వీళ్లంత.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుతున్నారని సమాచారం.
First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading