HOME »NEWS »POLITICS »jr ntr political entry balakrishna comments on jr ntr bk

Jr.NTR Political Entry: వ‌స్తే... రానిస్తారా? ప‌దేళ్ల త‌రువాత జూ.ఎన్టీఆర్ పై మ‌ళ్లీ ఫోక‌స్!

Jr.NTR Political Entry: వ‌స్తే... రానిస్తారా?  ప‌దేళ్ల త‌రువాత జూ.ఎన్టీఆర్ పై మ‌ళ్లీ ఫోక‌స్!
ఎన్టీఆర్,బాలకృష్ణ (File/Photo)

ఎన్టీఆర్ 25 వ‌ర్ధంతి రోజు జూ. ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై జోరుగా చ‌ర్చ... కీలకంగా మారిన బాల‌య్య వ్యాఖ్య‌లు!!

  • Share this:
    దాదాపు ప‌దేళ్ల త‌రువాత మ‌ళ్లీ పొలిటిక‌ల్ గ్రౌండ్స్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. సోమ‌వారం జ‌రిగిని ఎన్టీఆర్ 25 వ‌ర్ధంతి రోజు జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ పై మ‌ళ్లీ జోరుగా చ‌ర్చి జ‌రిగింది. గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీ ని వీడిన‌ప్పుడు జూనీయ‌ర్ ఎన్టీఆర్ పోలిటిక‌ల్ ఎంట్రీ పై జోరుగా చ‌ర్చ జ‌రిగింది. ఒక ద‌శ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ తో వ‌ల్ల‌భ‌నేని వంశీ ట‌చ్ లోకి వెళ్లినందుకే లోకేష్ వంశీపై త‌న అనుకూల మీడియాతో ఇబ్బంది పెట్టే క‌థ‌నాలు ప్రచురించార‌ని ఆరోపించారు వంశీ. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను కావాల‌నే టీడీపీకి దూరం చేయ‌డానికి చూస్తోన్నార‌ని అప్ప‌ట్లో వంశీ ఆరోపించారు కూడా.

    అయితే తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజు జూనియ‌ర్ ఎన్టీఆర్ సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కీల‌కంగా మారాయి. ఎప్ప‌టికైన మావాడు ఇక్క‌డ‌కి రావాల్సిందే కదా అని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర బాల‌య్య వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఇప్పుడు ఈ మాట‌లే హాట్ టాఫిక్ గా మారాయి. దీంతో మ‌ళ్లీ ఫోకస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ పైకి వెళ్లిందంటున్నారు పార్టీలో కొంద‌రు కీల‌క నేత‌లు. ఇదిలా ఉంటే గ‌త కొద్ది రోజులుగా చంద్ర‌బాబు, బాల‌య్య మ‌ద్య గ్యాప్ కూడా బాగా పెరిగింద‌ని ఈ గ్యాప్ ఎన్టీఆర్ ను బాల‌య్య ద‌గ్గ‌ర తీసుకోవాడానికి ప‌నికొస్తోందంటున్నారు పార్టీ లో కొంద‌రు కీల‌క నేత‌ల అభిప్రాయం. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి బాలకృష్ణ అడిగితే బాబు పొలిట్ బ్యూరో తో స‌రిపెట్ట‌డంపై బాల‌య్య గ‌త కొద్ది రోజులుగా గ‌రం గ‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీయే మా నాన్న‌ది అయిన‌ప్పుడు మ‌ధ్య‌లో బాబు పెత్త‌న‌మేంట‌నే భావ‌న‌లో బాల‌య్య ఉన్న‌ట్లు అత‌ని స‌న్నిహితుల స‌మాచారం. ఇదిలా ఉంటే 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగు దేశం త‌రుపున ప్ర‌చారం చేశారు. ఆ స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌కు తాను స‌మ‌ర్ధ‌వంతంగా స‌రిపోతాన‌నే అభిప్రాయాన్ని అంద‌రిలో క‌లిగేలా ఒక ముద్ర వేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ వ్య‌వ‌హారాల్లో కాని ఇత‌ర కుటుంబ కార్య‌క్ర‌మాల్లో కాని ఎన్టీఆర్ మ‌ళ్లీ ఎక్క‌డ క‌నిపించ‌డ‌లేదు. దీంతో పార్టీలో ఒక వ‌ర్గం బాబు, లోకేష్ కావాల‌నే జూనియ‌ర్ ను ప‌క్క‌న పెట్టార‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు కూడా అందులో భాగంగానే కొడాలి నాని పార్టీ వీడి వైఎస్ ఆర్సీలో చేరారు.



    అప్ప‌టి నుంచి అడ‌ప‌ద‌డ‌ప జూనియ‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి కాని జూనియ‌ర్ ఎన్టీఆర్ వైపు నుంచి మాత్రం ఇందుకు స‌ముఖంగా సంకేతాలు అయితే క‌నిపించ‌డం లేదు. కాని గ‌తంలో త‌న క‌ట్టే కాలే వ‌ర‌కు టీడీపీతోనే ఉంటాని ఆయ‌న స్ప‌ష్టం చేసి ఊరుకున్నారు. ఎప్పుడు పార్టీకి త‌న అవ‌స‌రం వ‌చ్చిన తాను వెళ్లి సేవాలందించ‌డానికి రెడీగా ఉన్నాన‌ని ఏనాడో స్ప‌ష్టం చేశారు. అయితే ఆయ‌న సేవాల‌ను చంద్ర‌బాబు, లోకేష్ ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో తీసుకుంటారా అనేదే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీలో అయితే చంద్ర‌బాబు త‌రువాత పార్టీని అంత స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపే నాయకుడు క‌నిపించ‌డం లేదు. లోకేష్ ఉన్ప‌ప్ప‌టికి పార్టీలో క్రీయాశీల‌క నేత‌గా ఎదిగారే కాని పార్టీలో కీల‌క నేత కాలేక‌పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరిలో ఓట‌మి కూడా లోకేష్ స‌మ‌ర్ధ‌త‌పై అనుమానాల‌ను పెంచింది. ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ జూనియ‌ర్ ఎన్టీఆర్ పోలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సారి కూడా ఇది చ‌ర్చ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుందా లేకా ఆ దిశ‌గా ఏమైన అడుగులు ప‌డ‌తాయి అనేది చూడాలంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.
    Published by:Balakrishna Medabayani
    First published:January 19, 2021, 10:27 IST