ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ ఫ్లెక్సీ... కనిపించని చంద్రబాబు ఫోటో

ఓ టీడీపీ నేత... 2024లో రాష్ట్రానికి కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

news18-telugu
Updated: January 16, 2020, 3:12 PM IST
ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ ఫ్లెక్సీ... కనిపించని చంద్రబాబు ఫోటో
టీడీపీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
టీడీపీలో ఎవరొచ్చినా... చంద్రబాబు నాయకత్వంలోనే పని చేయాలని ఆ పార్టీ నేతలు చాలాసార్లు స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం ఇదే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు మాత్రం భవిష్యత్తుల్లో పార్టీని నడిపించే సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. తాజాగా ఓ టీడీపీ నేత... 2024లో రాష్ట్రానికి కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకాశం జిల్లా యెర్రగొండ పాలెంలో తెలుగుదేశం పార్టీ నేతలు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులో నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈమె 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆయన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం బలరాంకు అనుచరురాలిగా ఉన్నారు. ఆమె అనుచరులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కింద రాబోయే కాలానికి కాబోయే సీఎం, 2024 ముఖ్యమంత్రి అంటూ ఉండటం గమనార్హం. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేకపోవడం మరో ట్విస్ట్. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో... ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి టీడీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైందనే టాక్ వినిపిస్తోంది.
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>