Home /News /politics /

JR NTR AND KALYANRAM MAY CAMPAIGN FOR SISTER SUHASINI IN KUKATPALLY

సోదరి కోసం.. ప్రచార పర్వంలోకి నందమూరి వారసులు

నందమూరి సుహాసిని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్(File)

నందమూరి సుహాసిని, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్(File)

ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య.. ఈ ముగ్గురు ప్రచారంలో దిగితే టీడీపీ పోటీ చేస్తున్న మిగతా స్థానాలకు కూడా అది కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది.

    తెలంగాణ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి సుహాసిని బరిలో దిగబోతున్నారు. కూకట్‌పల్లి నుంచి ఆమెను బరిలో దించాలని నిర్ణయించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆమె గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లిలో కాస్త కష్టపడగలిగితే గెలుపు సాధ్యమే అని లెక్కలు వేస్తున్నారు. ఇందుకోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లను సైతం ప్రచార బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

    అక్కను గెలిపించేందుకు ఈ ఇద్దరు సోదరులతో కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లతో చంద్రబాబు చర్చించారన్న ప్రచారం జరుగుతోంది. పోటీ చేస్తుంది సోదరియే కాబట్టి.. ఈ ఇద్దరు అన్నాదమ్ములు ప్రచార పర్వంలో పాల్గొనడం ఖాయమంటున్నారు.

    మరోవైపు శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ తరుపున బాలయ్య ప్రచారం చేయడం కూడా దాదాపు ఖాయమనే చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణ ఎన్నికల్లో ఈసారి నందమూరి వారసుల ప్రచార హవా కనిపించనుంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బాలయ్య.. ఈ ముగ్గురు ప్రచారంలో దిగితే టీడీపీ పోటీ చేస్తున్న మిగతా స్థానాలకు కూడా అది కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Balakrishna, Chandrababu naidu, Jr ntr, Kalyan Ram Nandamuri, Mahakutami, Telangana Election 2018, Telangana News

    తదుపరి వార్తలు