నెక్ట్స్ కమల దళపతి ఆయనే...ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం

JP Nadda to succeed Amit Shah as BJP chief | విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోదీ కేబినెట్‌లో అమిత్ షా కూడా చేరనున్నారు. అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాకు బీజేపీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 30, 2019, 5:18 PM IST
నెక్ట్స్ కమల దళపతి ఆయనే...ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం
జేపీ నడ్డా (ఫైల్)
  • Share this:
నరేంద్ర మోదీ కేబినెట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేరనున్నారా? లేదా? అన్న అంశంగా గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.  నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడైన అమిత్ షా కూడా మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్నారు. కేంద్ర కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల మధ్య గత 24 గంటలుగా పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరకు అమిత్ షా కూడా కేంద్ర కేబినెట్‌లో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఈ సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, మంత్రులతో పాటుగా అమిత్ షా కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జేపీ నడ్డాకు బీజేపీ సారథ్య బాధ్యతలు?

అమిత్ షా మంత్రివర్గంలో చేరనుండడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా నియమితులు కావచ్చన్న ప్రచారం జోరందుకుంది. మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారి జాబితాలో జేపీ నడ్డా పేరు లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. కేబినెట్‌లో తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జేపీ నడ్డాకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. జేపీ నడ్డా  పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టనున్నందునే ఆయనకు కేబినెట్‌లోకి తీసుకోవడం లేదని వారు భావిస్తున్నారు.

మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్న బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాల ఎంపీలు అందరికీ అమిత్ షా స్వయంగా ఫోన్లు చేసి, వారిని కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు సమాచారమిచ్చారు. కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవానికి ముందుగా సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచే అమిత్ షా వారికి ఫోన్లు చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.అమిత్ షాతో పాటు మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకోనున్న వారి జాబితాలో సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కారీ, వీకే సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, డాక్టర్ హర్షవర్థన్, రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, సదానంద గౌడ్, అర్జున్ మేగ్వాల్, కిరెన్ రిజిజు, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయన్, ప్రకాష్ జవదేకర్, రాందాస్ అథువలె, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>