అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా?.. మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే..

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఎంపీ జగత్ ప్రకాశ్ నడ్డాకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. 59ఏండ్ల నడ్డాకు అమిత్ షాతో సాన్నిహిత్యం కారణంగా పార్టీ ఆయనవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: May 30, 2019, 8:34 AM IST
అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా?.. మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే..
జేపీ నడ్డా (ఫైల్)
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జయ కేతనం ఎగురవేసింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 300 మార్కును దాటి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ గెలుపు వెనుకు మోదీ ఛరిష్మా ఎంత ఉందో.. అమిత్ షా వ్యూహరచన, పనితీరు అంతే ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీని అనేక రాష్ట్రాలను కాషాయమయం చేశారు. అయితే, ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నారా? ఆ పదవి వేరొకరి సొంతం కానుందా? దానికి మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయం అవడమే కారణమా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఈ రోజు మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ జాబితాలో గాంధీనగర్ నుంచి గెలుపొందిన అమిత్ షాకు బెర్తు దాదాపుగా ఖరారైంది. అందువల్ల పార్టీ అధ్యక్ష పదవిని ఎంపీ జగత్ ప్రకాశ్ నడ్డాకు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పదవికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది. 59ఏండ్ల నడ్డాకు అమిత్ షాతో సాన్నిహిత్యం కారణంగా పార్టీ ఆయనవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. గత మోదీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడైన నడ్డా బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

పార్టీలో మాస్టర్ స్ట్రాటజిస్ట్ అని నడ్డాకు పేరుంది. చాలా వేగంగా వ్యూహాలు రచిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. మినీ ఇండియాగా పేరొందిన ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి ఎన్నికల ఇన్‌చార్జిగా ఈ ఏడాది జనవరిలో నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80సీట్లలో బీజేపీ ఏకంగా 62 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షం అప్నాదళ్ రెండింట్లో విజయం సాధించింది. బీఎస్పీ-ఎస్పీ కూటమి నుంచి గట్టీ పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంలో ఆయన వ్యూహాలు ఫలించాయి. నడ్డాకు బీజేపీ అధ్యక్ష పదవి అప్పగించేందుకు ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
First published: May 30, 2019, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading