బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా

JP Nadda | జేపీ నడ్డా పూర్తిపేరు జగత్ ప్రకాష్ నడ్డా. 1960 డిసెంబర్ 2న బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో పెరిగారు.

news18-telugu
Updated: June 17, 2019, 8:36 PM IST
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా
జేపీ నడ్డాను అభినందిస్తున్న అమిత్ షా (Image:ANI)
news18-telugu
Updated: June 17, 2019, 8:36 PM IST
భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా ఎంపికయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. జేపీ నడ్డాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేపీ నడ్డా పూర్తిపేరు జగత్ ప్రకాష్ నడ్డా. 1960 డిసెంబర్ 2న బీహార్‌లోని పాట్నాలో జన్మించారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో పెరిగారు. నరేంద్ర మోదీ మొదటి టెర్మ్‌లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీలో పార్లమెంటరీ బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది చివరి వరకు అమిత్ షానే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.  2014 జూలైలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి కావడంతో పార్టీ పగ్గాలను అమిత్ షాకు అప్పగించారు. అనంతరం 2016లో రెండోసారి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ బలం పుంజుకుంది. 10 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఎన్నో రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయాలు నమోదు చేసింది. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం కొనసాగింది. 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టింది.
First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...