అందోల్‌లో క్రాంతి గెలుపు.. ఎమ్మెల్యే అయిన జర్నలిస్టు

Telangana assembly elections 2018|ఎవరి అంచనాకు అందకుండా టీఆర్ఎస్ సృష్టించిన ప్రభంజనంలో.. అందోల్ నియోజకర్గం జర్నలిస్టు కాంత్రికిరణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో జర్నలిస్టు చట్టసభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.

news18-telugu
Updated: December 11, 2018, 2:15 PM IST
అందోల్‌లో క్రాంతి గెలుపు.. ఎమ్మెల్యే అయిన జర్నలిస్టు
kranthi with kcr file
  • Share this:
తెలంగాణ ఎన్నికల్లో మరోసారి గులాబీ గుబాళించింది. ఎవరి అంచనాకు అందకుండా టీఆర్ఎస్ సృష్టించిన ప్రభంజనంలో.. అందోల్ నియోజకర్గం నుంచి జర్నలిస్టు కాంత్రికిరణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో మీడియా ప్రతినిధి చట్టసభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా అందోల్‌ నుంచి పోటీ చేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్ ఘన విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి చట్టసభకు ఎన్నికైన మరో జర్నలిస్టుగా రికార్డు సృష్టించారు. అనూహ్యంగా టీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకున్న కాంత్రి... ఉద్దండులుగా పేరొందిన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని.. దాదాపు 22,000 మెజార్టీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున బాబూమోహన్ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి ఆయనకు టిక్కెట్ నిరాకరించిన టీఆర్ఎస్ అధిష్ఠానం.. అనూహ్యంగా జర్నలిస్టు క్రాంతి కిరణ్ ను రంగంలోకి దించింది. దీంతో బాబూమోహన్ బీజేపీ తరపున బరిలో నిలిచారు.

ఓవైపు కూటమి అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా, మరోవైపు బీజేపీ అభ్యర్థి బాబూమోహన్... ఇద్దరూ ఉద్దండులుగా పేరున్నవారే. వీరిద్దరి మధ్య కాంత్రి విజయం అంత సులువు కాదనే అభిప్రాయం రాజకీయాల్లో వ్యక్తమైంది. అయితే, లోకల్ కార్డు(స్థానికం)తో ప్రజల్లోకి వెళ్లిన క్రాంతి... అనూహ్య విజయం సాధించారు. సమీప కూటమి అభ్యర్థి దామోదర్ రాజనర్సింహాపై 22,000 మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరో జర్నలిస్టు చట్టసభలోకి ప్రాతినిథ్యం వహిస్తున్నట్టైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణలు జర్నలిస్టులుగా పనిచేసిన వారే కావడం విశేషం.

First published: December 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>