చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దంగల్ సినిమా బాగుందని నాతో అన్నారు...ప్రధాని మోదీ వెల్లడి

గత వారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన సందర్భంగా దంగల్ సినిమాను ఆయన చూసినట్లు, అలాగే ఆ చిత్రం తనకు నచ్చిందని చైనా అధ్యక్షుడు స్వయంగా చెప్పారని మోదీ తెలిపారు.

news18-telugu
Updated: October 15, 2019, 6:52 PM IST
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దంగల్ సినిమా బాగుందని నాతో అన్నారు...ప్రధాని మోదీ వెల్లడి
ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
  • Share this:
ప్రపంచ ప్రఖ్యాత మహిళా రెజ్లర్ బబితా ఫొగట్ జీవిత కథ ఆధారంగా తీసిన బాలివుడ్ సినిమా దంగల్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చూసిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బహరింగ సభలో ఈ విషయం తెలియజేశఆరు. దేశం గర్వించేలా కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో బంగారు పథకం సాధించిన బబితా ఫోగట్ బిజెపి అభ్యర్థిగా హర్యానాలోని దాద్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఆమె తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ప్రధాని మోడీ గత వారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమైన సందర్భంగా దంగల్ సినిమాను ఆయన చూసినట్లు, అలాగే ఆ చిత్రం తనకు నచ్చిందని చైనా అధ్యక్షుడు స్వయంగా చెప్పారని మోదీ తెలిపారు.

ఇంత గొప్ప క్రీడాకారిణిని భారతదేశానికి ఇచ్చిన హర్యానాను తలచుకుని గర్వించానని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ప్రస్తావించారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు