మోడీ సర్కారుకు షాక్...ఆ కీలక బిల్లుకు మద్దతివ్వని జేడీయు

Triple Talaq Bill | ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: July 25, 2019, 5:31 PM IST
మోడీ సర్కారుకు షాక్...ఆ కీలక బిల్లుకు మద్దతివ్వని జేడీయు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండు మాసాల మోదీ సర్కారుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయు షాక్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రటిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేడీయు ఎంపీ రాజీవ్ రంజన్...మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఈ బిల్లు ఓ వర్గానికి చెందిన వారిలో అపోహలు కలిగించేలా ఉందని వ్యాఖ్యానించారు. కఠినమైన చట్టాలతో సమాజాన్ని నడిపించడం సాధ్యంకాదని, ట్రిపుల్ తలాక్ విషయంలో ప్రజల్లో అవగాహన తీసుకొస్తే సరిపోయేదన్నారు. సమాజానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయని...దీనికి తిలోధకాలిస్తే ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పారు.

 triple talaq bill, jdu, lok sabha, triple talaq news, triple talaq latest news, ట్రిపుల్ తలాక్, ట్రిపుల్ తలాక్ బిల్లు, లోక్‌సభ
ప్రతీకాత్మక చిత్రం (photo-reauters


ముందస్తు ఆలోచన లేకుండా గతంలో తీసుకొచ్చిన పలు చట్టాలు దుర్వినియోగం అయ్యాయని గుర్తుచేశారు. ఇలా చట్టాలు చేస్తే...ట్రిపుల్ తలాక్ చట్టం కూడా భవిష్యత్తులో దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
Published by: Janardhan V
First published: July 25, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading