జైల్లో ఉన్న లాలూ అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం...ట్వీట్స్ చేయడం ఎలా సాధ్యం...

లాలూ ప్రసాద్ యాదవ్(File)

జైలులో ఉన్న వ్యక్తి ఆర్జేడీ అభ్యర్థులకు ఎంపీ టిక్కెట్లు ఎలా ఇస్తారని దీనిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని జేడీయూ లేఖ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

  • Share this:
    ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఖైదీగా ఉంటూనే అభ్యర్థులకు టిక్కెట్లను ఇస్తున్నారని జేడీయూ మండిపడింది. ఆర్జేడీ తరపున అభ్యర్థులుగా డిక్లేర్ చేస్తూ ఇచ్చే పత్రంపై లాలూ ప్రసాద్ సంతకం చేసి ఉండటంపై జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసింది. జైలులో ఉన్న వ్యక్తి అభ్యర్థులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని దీనిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని జేడీయూ తరపున నీరజ్ కుమార్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. లేఖలో ప్రధానంగా, పశుదాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ టిక్కెట్లు పంచేందుకు ఎలక్షన్ కమిషన్ వద్ద అనుమతి తీసుకున్నారా...అని పేర్కొన్నారు. అంతేకాదు, ఒక వేళ ఎలక్షన్ కమిషన్ అలాంటి అనుమతి ఇవ్వకపోతే మాత్రం చర్యలుతీసుకోవాలని కోరింది. అలాగే జైలు నిబంధనల ప్రకారం, జైలులో విజిటర్స్‌ రాజకీయాలు మాట్లాడకూడదని ఉంది. అలాగే జైలులో ఉన్న లాలూ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ ఎవరు వాడుతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈసీఐ వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని జేడీయూ డిమాండ్ చేసింది.

    ఇదిలా ఉంటే లాలూప్రసాద్ యాదవ్ ఇటీవల ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ద్వయాన్ని విమర్శించేందుకు ఏ మాత్రం కూడా చాన్స్ వదులుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో లాలూ చేసిన డబ్‌మాష్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
    First published: