Karnataka floor test | పతనం అంచున కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు...బెంగళూరులో ఉద్రిక్తత...

కుమార ప్రభుత్వం కూలిపోతే శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. అంతే కాదు కర్నాటకలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

news18-telugu
Updated: July 23, 2019, 6:54 PM IST
Karnataka floor test | పతనం అంచున కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు...బెంగళూరులో ఉద్రిక్తత...
కుమారస్వామి ఫైల్
news18-telugu
Updated: July 23, 2019, 6:54 PM IST
గత వారం రోజులుగా సాగిన కర్నాటక పొలిటికల్ డ్రామా క్లైమాక్స్ కు చేరింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడం లాంఛనమైంది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో దాదాపు విఫలమయ్యే అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 20 మంది అధికార పక్షం ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంతో బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జెడీఎస్ వినతిని స్పీకర్ తోసి పుచ్చగా, కుమార సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వానికి విశ్వాసపరీక్షకు సాయంత్రం 6 గంటలకు జరపాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ సీఎం మాత్రం సుదీర్ఘ ప్రసంగం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎం ప్రసంగం తర్వాత విశ్వాస పరీక్ష ముగించే అవకాశం ఉంది. సమయం ముగుస్తుండటంతో ఎలాగైనా ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ, కుమార స్వామి మాత్రం తనకు మరో 3 గంటల సమయం కావాలని పేర్కొనడం గమనార్హం.

ఇదిలాఉంటే సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అవుతుంది. 15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సభకు గైర్హాజరు అయ్యారు. ఈ సమయంలో స్పీకర్‌ బలనిరూపణకు ఆదేశిస్తే విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే వీలుంది.

కాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగం తర్వాత విశ్వాసపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్‌ ప్రకటించారు. ఇదిలా ఉంటే బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కోసం అటు బీజేపీ కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యేలను కలిసేందుకు బెంగళూరులోని నితీష్ టవర్స్ అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లిన ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు.. బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఇదిలా ఉంటే కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమార ప్రభుత్వం కూలిపోతే శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. అంతే కాదు కర్నాటకలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేశారు.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...