• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JDS CONGRESS REGIME FAIL KARNATAKA ASSEMBLY FLOOR TEST KUMARASWAMY GOVERNMENT COLLAPSE MK

Karnataka floor test : కుమార పరాభవం... కర్ణాటకలో కూలిన కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్

Karnataka floor test : కుమార పరాభవం... కర్ణాటకలో కూలిన కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్

సీఎం కుమార స్వామి (ఫైల్ చిత్రం)

Karnataka floor test: కర్నాటక పొలిటికల్ డ్రామా చివరకు కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడంతో ముగిసింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది.

  • Share this:
    గత వారం రోజులుగా సాగిన కర్నాటక పొలిటికల్ డ్రామా చివరకు కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలడంతో ముగిసింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జెడీఎస్ వినతిని స్పీకర్ తోసి పుచ్చడంతో, కుమార సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది.  హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి

    ఇదిలా ఉంటే  విశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మంత్రి డీకే.శివకుమార్ శాయశక్తులా మంత్రాంగం నడిపినప్పటికీ, ఆయన పాచికలు పారలేదు. దీంతో ఆయన వేదాంత ధోరణిలోకి వెళ్లిపోయారు. బీజేపీ తీరును ఆయన తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అధికార దాహం తగదని, అందరం ఏదో ఒక రోజు తనువు చాలించాల్సిన వారమేనని అన్నారు. అంతేకాదు తనను వెన్నుపోటు పొడిచి బీజేపీ పంచన చేరిన తన స్నేహితులు రేపు వారిని కూడా వెన్ను పోటు పొడవటం ఖాయమని అన్నారు. ఓటమి వల్ల మహా అయితే కొందరు రాత్రికి రెండు పెగ్గులు అదనంగా తీసుకుని బాధ మరిచిపోతామని అన్నారు.
    First published:

    అగ్ర కథనాలు