పవన్‌కు విషెస్ చెబుతూ లక్ష్యాన్ని గుర్తుచేసిన జేడీ..

జేడీ లక్ష్మీనారాయణ,పవన్ కల్యాణ్

జనసేన పార్టీ నేత జేడీ లక్ష్మీ నారాయణ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ద్వారా జాతిని నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిద్దామని ఆకాంక్షించారు.

  • Share this:
    జనసేన అధినేత పవన్ కల్యాణ్ 51వ పుట్టినరోజు నేడు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజును పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజాగా జనసేన పార్టీ నేత జేడీ లక్ష్మీ నారాయణ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ద్వారా జాతిని నిర్మించే కార్యక్రమాన్ని కొనసాగిద్దామని ఆకాంక్షించారు. తద్వారా పార్టీ లక్ష్యాన్ని జేడీ మరోసారి పవన్‌కు గుర్తుచేశారు.కాగా, పవన్ కల్యాణ్‌కు జేడీకి గ్యాప్ వచ్చిందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.ఒక దశలో జేడీ పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. పవన్ ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరోలో లక్ష్మీనారాయణకు చోటు దక్కకపోవడం కూడా ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే జేడీ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. తాను పార్టీకి ఉపయోగపడుతానని అధినేత భావించినన్ని రోజులు జనసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.


    Published by:Srinivas Mittapalli
    First published: