Jc broters: వైసీపీలోకి జేసీ బ్రదర్స్! తాడిపత్రి చైర్మన్ గా ఎన్నికైన వెంటనే జగన్ కు జై కొట్టిన ప్రభాకర్ రెడ్డి

Jc broters: వైసీపీలోకి జేసీ బ్రదర్స్! తాడిపత్రి చైర్మన్ గా ఎన్నికైన వెంటనే జగన్ కు జై కొట్టిన ప్రభాకర్ రెడ్డి

జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్(Image: Facebook)

జేపీ బ్రదర్స్ వైసీపీ గూటికి చేరుతున్నారా? తమని తాము నిరూపించుకోడానికే తాడిపత్రి ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా. ఈ విజయంతో జగన్ కు తమ విలువు తెలిసేలా చేయాలి అనుకున్నారా? జగన్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి జై కొట్టడం వెనుక రాజకీయ కారణాలు ఏమున్నాయి?

  • Share this:
ఏపీలో నిన్నటి వరకు జగన్ వర్సెస్ జేసీ బ్రదర్స్ గా పరిస్తితి నడిచింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తీరుపై జేసీ బ్రదర్స్ నిప్పులు చెరిగేవారు. అవకాశం దొరికతే చాలు జగన్ పై సెటైర్లు వేసేవారు జేసీ దివాకర్ రెడ్డి.. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి తారుమారైంది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో జగన్ ప్రభంజనం కనిపించింది. భారీ విజయంతో సీఎం అయ్యారు. అప్పటి నుంచి జేసీ బ్రదర్స్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందనే చెప్పాలి.. కేసు వెంట కేసులు వెంటాయి. ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వస్తే.. మరో కేసులో జైలుకు వెళ్లేవారు.

జగన్ తనపై కక్ష సాధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు కూడా.. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ కు చక్రవడ్డీతో సహా రివేంజ్ తీర్చుకుంటామని బహిరంగంగానే చెప్పారు. మొన్నటి మున్సిపల్ పోలింగ్ కు ముందు కూడా జగన్ పై జేసీ ఒంటికాలుపై లేచారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని.. నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకుంటున్నారని.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఇలా వైసీపీకి జేసీ బ్రదర్స్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం ముదిరింది..

ఇక మున్సిపల్ ఫలితాల విషయానికి వస్తే ఏపీ వ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది. కేవలం రెండు మున్సిపాలిటీల్లో మినహా ఎక్కడా టీడీపి పోటీలో నిలబకలేకపోయింది. వార్ వన్ సైడ్ అయ్యింది. ఒక్క మైదుకూరు, తాడిపత్రిలో మాత్రమే టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది. అయితే మైదుకూరులో ఎక్స్ అఫిషియో సభ్యుల మెజార్టీతో చైర్మన్ పీఠాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇటు తాడిపత్రి పీఠానికి కూడా వైసీపీ ప్రయత్నాలు  చేసిందని గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డే స్వయంగా ఆరోపించారు. ముందుగానే అలర్ట్ అయిన ఆయన టీడీపీ నుంచి గెలిచిన 16 మందితో పాటు, సీపీఐ, స్వతంత్య్ర అభ్యర్థులను క్యాంప్ కు తీసుకెళ్లారు. అయినా ఎక్స్ అఫీయో మెంబర్స్ ద్వారా వైసీపీ తాడిపత్రి చైర్మన్ పీఠం దక్కించుకునే ప్రయత్నం చేసిందని టీడీపీ వర్గీయులు ఆరోపించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓటు చెల్లదని కమిషనర్ చెప్పడంతో.. తాడిపత్రితో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ తాడిపత్రి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

చైర్మన్ గా ఎన్నికైన వెంటనే ఆయన తన స్వరం మార్చారు. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు జగన్ అంటే అంత ఎత్తున లేచే ఆయన.. ఇప్పుడు సీఎం జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగానే.. ఆయనలో కూడా విలువలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించిను అన్నారు. సీఎం జగన్ సహకారం లేకపోతే తాను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉండేవాన్ని కాదంటూ కొనియాడారు. త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఒక్కసారిగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్వరం మార్చడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటున్నారు రాజకీయ నిపుణులు. జేసీ సోదరులను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వాటి నుంచి బెయిల్ తెచ్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా.. ఎన్నికలు ఏవైనా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ నుంచి అండ ఉన్నా లాభం లేదని జేసీ బ్రదర్స్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడి.. కష్టాలు తెచ్చుకోవడం కంటే.. సర్దుకుపోదాం రండి అన్నట్టు వ్వవహరిస్తే.. కేసుల నుంచి అయినా ఉపసంహరణ లభిస్తుందని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్టు సమాచారం అందుకే ఆయన సీఎం జగన్ ను కలుస్తానని అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీ వర్గీయులు మాత్రం తాము తాడిపత్రి నెగ్గాలి అనుకుంటే ఎలాగైనా గెలిచే వారమని.. కానీ నిజాయితీకి కట్టుబడే తాము అటువైపు ఫోకస్ చేయలేదు అంటున్నారు.. ఆ విషయాన్ని గుర్తించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
Published by:Nagesh Paina
First published: