హోమ్ /వార్తలు /రాజకీయం /

Nara Lokesh: జగన్ వల్లే టీడీపీ నేతకు కరోనా.. మండిపడ్డ లోకేష్

Nara Lokesh: జగన్ వల్లే టీడీపీ నేతకు కరోనా.. మండిపడ్డ లోకేష్

తొలి సారి సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన లోకేష్

తొలి సారి సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పిన లోకేష్

Nara Lokesh Comments: ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో సీఎం జగన్ బిజీగా ఉన్నారని నారా లోకేష్ ఆరోపించారు.

  Nara Lokesh Comments on YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒక పక్క కరోనా, మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకులపై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయారని.. దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుందని లోకేష్ విమర్శించారు.


  జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్‌పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్ట్ చేశారని ఆరోపించారు. కడప జైలులో జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరమని వ్యాఖ్యానించిన లోకేష్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జైలులో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి తక్షణమే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

  ఇక 54 రోజుల పాటు కడప జైలులో ఉండి ఈ నెల 6న బెయిల్‌పై విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ఆ మరుసటి రోజే అరెస్ట్ చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. సీఐ దేవేందర్‌ను దూషించిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో కేసు కూడా నమోదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను కడప జైలుకు తరలించారు. కొద్దిరోజులుగా ఆయన కడప జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తాజాగా జైలులోనే ఆయనకు కరోనా సోకడంలో.. ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Jc prabhakar reddy, Nara Lokesh

  ఉత్తమ కథలు