• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JC PRABHAKAR REDDY AND JC ASMIT REDDY RELEASED FROM KADAPA JAIL BA

కడప జైలు నుంచి విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...

కడప జైలు నుంచి విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...

తెలుగుదేశం పార్టీ లోగో

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.

  • Share this:
    అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి రిజిస్టర్ చేయించారనే ఆరోపణల మీద ఏపీ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా జైల్లో ఉన్న వారికి కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. దీంతో ఈ రోజు వారిద్దరూ కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై తాడిపత్రి పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3 వాహనాలను బీఎస్ - 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. తమకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఈ కేసులో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తాజాగా వారికి బెయిల్ లభించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు