• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • JC DIWAKAR REDDY SENSATIONAL COMMENTS ON YS SHARMILA AND YS JAGAN NGS

Andhra Pradesh: వైఎస్ విజయమ్మకు జగన్.. షర్మిలలో ఎవరంటే ఎక్కువ ప్రేమ? ఏపీలోనూ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారా?

Andhra Pradesh: వైఎస్ విజయమ్మకు జగన్.. షర్మిలలో ఎవరంటే ఎక్కువ ప్రేమ? ఏపీలోనూ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారా?

వైఎస్ జగన్, షర్మిల

జగన్ ను కాదని షర్మిల ఏపీలోకి అడుగు పెడతారా? అందుకు విజయమ్మ ఒప్పుకుంటారా? ఇద్దరి పార్టీల మద్య ఏపీలో పోటీ ఉంటే? విజయమ్మ ఎవరి వెంట వెళ్తారు? ప్రస్తుతం వైఎస్ అభిమానులను ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

  • Share this:
    తెలుగు రాజకీయాల్లో షర్మిల ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆమె పెట్టే పార్టీ పేరు ఏంటి? ఎప్పుడు ప్రకటిస్తారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? షర్మిల వెంట నడిచేది ఎవరు? పార్టీ పెట్టిన తరువాత తెలంగాణకే పరిమితం అవుతారా? ఏపీలోనూ అడుగు పెడతారా? అన్నా చెల్లిళ్ల మధ్య విబేధాలు నిజమేనా? వైఎస్ విజయమ్మ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చలేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి..

    వైఎస్ అభిమానుల్లోనూ ఇప్పుడు అనేక సందేహాలు ఉన్నాయి. షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. ఎవరి వెంట నడవాలి? అసలు జగన్ ను కాదని షర్మిల ఏపీలోకి అడుగు పెడతారా? అందుకు విజయమ్మ ఒప్పుకుంటారా? ఇద్దరి పార్టీల మద్య ఏపీలో పోటీ ఉంటే? విజయమ్మ ఎవరి వెంట వెళ్తారు ఇలా ఎన్నో అనుమాలు ఉన్నాయి..

    అలాంటి ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు వివాదాస్పద నేత జేసీ దివాకర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని దగ్గరుండి గమనించిన ఆయన.. విజయమ్మతో షర్మిలకు ఉండే అనుబంధాన్ని వివరించారు. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి.. తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తెలంగాణ వచ్చాక మీరు, మేము ఆగమైపోయామన్నారు. అక్కడికే పరిమితం అవ్వని జేసీ.. షర్మిల పార్టీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

    వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించిన జేసీ మాట్లాడుతూ షర్మిల ప్రస్తుతం వామప్ చేస్తోందని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఏడాదిన్నరలో ఆమె ఏపీలోకి కూడా ఎంటర్ అవుతారని జోస్యం చెప్పారు. అయితే వైఎస్ విజయలక్ష్మికి జగన్ కంటే.. కూతురు షర్మిల మీదనే ప్రేమ ఎక్కువన్నారు. అసలు సమస్య లేకుండా ఉండాలి అంటే సీఎం జగన్.. షర్మిలకు ఏదైనా కీలక పదవిస్తే సరిపోయేది అని అభిప్రాయపడ్డారు. అలాగే నరేంద్ర మోదీకి తమ మద్దతు లేకుండా ఏపీలో ఒక్క సీటు కూడా రాదని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.

    ఇటటు చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై  స్పందించిన ఆయన.. ఆ నోటీసులను చూసి ఆశ్చర్యపోలేదు అన్నారు. చంద్రబాబు నాయడికి కాబట్టి ఒక పేజీ నోటీసు వచ్చిందని.. అదే వై.ఎస్. జగన్ కు అయితే లారీల్లో నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. అంతేకాదు ఈ నోటీసులు చాలా ఆలస్యం అయ్యాయి అన్నారు. రెండున్నర ఏళ్ల కిందటే నోటీసులు వస్తాయి అనుకున్నామన్నారు. అనంతపురంలో తమ వీపు పగిలినప్పుడు.. చంద్రబాబు పని కూడా చెబుతారని అనుకున్నామన్నాని.. కానీ ఆలస్యమైంది అన్నారు. తాడిపత్రిలో విజయానికి జేసీ  ప్రభాకర్ రెడ్డి ఇమేజే కారణమన్నారు.

    అటు తెలంగాణ కాంగ్రెస్ పైనా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ను చంపేసింది ఆ రాష్ట్ర నేతలే అన్నారు దివాకర్ రెడ్డి. సీఎం పదవి కోసం ఆశపడిన నేతలు.. అధిష్టానాన్ని తప్పు దారి పట్టించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఈ విషయం చెప్పినా ఎవ్వరూ వినలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు కాలం చెల్లింది అన్నారు. రాష్ట్రం ఇచ్చినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు