జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తమ పార్టీకి చెందిన నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థంకావడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: May 21, 2020, 2:59 PM IST
జగన్‌పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్, జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. వాళ్లదే రాజ్యమని ఆయన ఆరోపించారు. వాళ్లు చెప్పిందే చేయాల్సిందే అని డీఎస్పీ కింది స్థాయి అధికారులు హెచ్చరిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. కోర్టులు ఎన్ని మొట్టకాయలు వేస్తున్నా సీఎం జగన్ లెక్కచేయడం లేదని ఆయన అన్నారు. అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. తమ పార్టీకి చెందిన నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థంకావడం లేదని జేసీ అన్నారు. ఇలాంటి వాటి వల్ల సీఎం జగన్ దిగొచ్చే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నాడని తనకు అనిపిస్తోందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.




First published: May 21, 2020, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading